వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి రాజయ్య తీరుతో కేసీఆర్ అప్‌సెట్: ఉద్వాసనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రధానంగా హైదరాబాదును స్వైన్ ఫ్లూ వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయమై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రి రాజయ్య పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజయ్యను తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

రాజయ్య పైన కేసీఆర్ దాదాపు మూడు నెలలుగా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజయ్య తీరు పైన కేసీఆర్ చాలా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

రాజయ్య గారు ఇక్కడ హెల్త్‌ యూనివర్సిటీ పెడ్తానన్నారని, ఈయన పెడతారా? ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, చేయగలిగిందే చెప్పాలని, కాళోజీ అదే చెప్పారని, అడ్డం పొడుగు మాటలు వద్దని, లేని మాటలు వద్దని... వరంగల్‌లోనే హెల్త్‌ యూనివర్సిటీ ఏర్పాటవుతుందంటూ ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై గత ఏడాది సెప్టెంబర్‌లో బహిరంగ వేదిక పైనే కేసీఆర్‌ అన్నారు. అయితే, వరంగల్ జిల్లాకే హెల్త్ యూనివర్సిటీ మంజూరు చేయడం వేరే విషయం.

Swine flu likely to ‘hit’ Health Minister T Rajaiah

అప్పుడే రాజయ్య పైన కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. రాజయ్య పని తీరుపై కేసీఆర్‌ అసంతృప్తి అంతర్గత సమావేశాల్లో బయటపడుతూనే ఉందని అంటున్నారు. ఇప్పుడు అది ఉద్వాసనకు దారి తీయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా స్వైన్‌ ఫ్లూ నియంత్రణలో వైఫల్యం కారణంతో రాజయ్యను తప్పించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాజయ్యపై ఇంత కోపానికి స్వైన్ ఫ్లూ నియంత్రణలో వైఫల్యం ఒక్కటే కారణం కాదని, అంతకు ముందు జరిగిన పలు ఉదంతాలపై మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డారని చెబుతున్నారు.

ఔట్ సోర్సింగ్‌ సిబ్బంది నియామకంలో అవకతవకలు, హెల్త్‌యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ ఎంపిక, 108 వాహనాల కొనుగోలు వంటి నిర్ణయాల్లో లోపాల నేపథ్యంలో రాజయ్యతో సన్నిహితంగా ఉండే అధికారులపై ఇప్పటికే వేటు వేశారని అంటున్నారు.

English summary
The swine flu outbreak has shaken the medical and health department and put a big question mark on the future of Deputy Chief Minister and minister for medical and health Dr Rajaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X