వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంగారు తెలంగాణకు టైం పడుతుంది: బతుకమ్మ వేడుకల్లో కవిత

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: బంగారు తెలంగాణ సాధానకు కొంత సమయం పడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కోటి బతుకమ్మలు ఎత్తుకున్నం, తెలంగాణ సాధించుకున్నమని ఆమె అన్నారు. బంగారు బతుకమ్మలను ఎత్తుకుందాం, బంగారు తెలంగాణ సాధించుకుందామని అన్నారు.

కొత్త రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కవిత అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని అంగడి మైదానంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా మహిళలు బతుకమ్మలతో వచ్చి పాల్గొన్నారు.

Kalvakuntla Kavitha

అందరం కలిసికట్టుగా కృషి చేసి బంగారు తెలంగాణను సాధించుకుందామన్నారు. నర్సంపేటలో మహిళల కోసం టౌన్‌హాల్‌ను నిర్మించేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. చెరువుల పునరుద్దరణ ద్వారా పంట పొలాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

మినిస్టర్స్ క్వార్టర్స్‌లో...

రాష్ట్రంలో పలుచోట్ల ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు, చిన్నారులు సహా బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకల్లో ఆనందోత్సహాలతో గడుపుతున్నారు. హైదరాబాదు నగరంలోని పలువాడలు బంతిపూల వనంలా మారాయి. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రుల భార్యలు, వారి బంధువులు, ఇతర మహిళలు బతుకమ్మ ఆడుతూ సంబురాలు జరుపుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ పలువురిని ఉత్సాహపరుస్తూ కనిపించారు.

దేశరాజధానిలో...

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణభవన్ బతుకమ్మ వేడుకలతో కలకలలాడుతోంది. సోమవారంనాడు తెలంగాణ భవన్‌లో బంగారు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ ఆడపడచులు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణకు చెందిన ఆడపడుచులు, యువతులు, చిన్నారులు పాల్గొన్నారు. బతుకమ్మ బతుకమ్మ ఊయాలో బంగారు బతుకమ్మ ఊయాలో అంటూ వీనుల విందుగా పాడుకుంటూ సంబురాలు జరుపుకుంటున్నారు.

తెలంగాణవ్యాప్తంగా...

తెలంగాణలో బంగారు బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొన్నారు. వాడ వాడలా, వీధి వీధినా బతుకమ్మ పాటలు మార్మోగాయి. బతుకమ్మలతో మహిళలు ప్రధాన కూడళ్లలో మహిళలు బతుకమ్మ ఆడారు.

English summary
Telangana Rastra Samithi (TRS) MP Kalvakuntla Kavitha said that time takes for Bangaru Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X