హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఏపీతో చర్చిస్తాం': ఉగాదికి నంది పురస్కారాలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉగాది రోజున నంది పురస్కారాలను ప్రదానం చేస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి ఉగాది పురస్కారాలు అందజేయలేదని, తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా నంది పురస్కారాలను అందజేయాలన్న సినీ ప్రముఖల అభ్యర్ధనపై ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామని మంత్రి వెల్లడించారు.

తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఈ మేరకు మంత్రి తలసాని అధ్యక్షతన గురువారం సమావేశమైంది. చిత్రపరిశ్రమ అభివృద్ధిపై సమావేశమైన సబ్ కమిటీ పలు అంశాలపై చర్చించిందని మంత్రి తలసాని తెలిపారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

 ఉగాదికి నంది పురస్కారాలు

ఉగాదికి నంది పురస్కారాలు

మంత్రులు కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావుతో కూడిన సబ్‌ కమిటీ సమావేశంలో చలనచిత్ర రంగ సమస్యలను చిత్ర ప్రముఖులు దాసరి నారాయణరావు, డి. సురేష్‌బాబు, మా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌, తదితరులు వివరించారు.

 ఉగాదికి నంది పురస్కారాలు

ఉగాదికి నంది పురస్కారాలు

చిత్ర ప్రముఖుల కోరిక మేరకు చిత్రపురికాలనీలో మరో 10 వేల కార్మికులకు ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో చిత్రపరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కొత్త ఆలోచనలతో తదుపరి సమావేశానికి రావాలని చిత్ర ప్రముఖులకు కేటీఆర్‌ సూచించారు.

 ఉగాదికి నంది పురస్కారాలు

ఉగాదికి నంది పురస్కారాలు

చిన్న సినిమాల కోసం ఇకపై సినిమా హాళ్లలో ఐదు షోలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తరహాలో జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

 ఉగాదికి నంది పురస్కారాలు

ఉగాదికి నంది పురస్కారాలు

ఇప్పటి వరకు ఇండియాలో పుణేలో మాత్రమే టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఉందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల వారు విమానాశ్రయం నుంచి నేరుగా వచ్చి చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసుకుని వెళ్లేలా అన్ని హంగులతో స్టూడియో ఏర్పాటుకు నివేదికను రూపొందించాలని సమాచార కార్యదర్శి నవీనమిట్టల్‌ను మంత్రి ఆదేశించారు.

English summary
Talasani srinivas rao Speech in the meet with tollywood Personalities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X