వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెమటోడ్చిన తలసాని: ఒక్క రోజులో రూ.16.50లక్షలు సంపాదించారు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరంగల్‌లో జరగనున్న భారీ బహిరంగ సభ కోసం తెలంగాణ మంత్రులందరూ చాలా కష్టపడిపోతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ అయితే రోజంతా చెమటోడ్చి భారీ మొత్తంలో సంపాదించారు. టీఆర్‌ఎస్‌ వరంగల్‌ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల ఖర్చుల కోసం నియోజకవర్గంలోని పలుప్రాంతాలలో మంగళవారం ఉద యం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తలసాని కూలీ పని చేశారు.

దుర్గం చెరువుపై తీగల వంతెన: ఆకర్షణతోపాటు ఐటీ కారిడార్‌కు రిలీఫ్! దుర్గం చెరువుపై తీగల వంతెన: ఆకర్షణతోపాటు ఐటీ కారిడార్‌కు రిలీఫ్!

రోజంతా శ్రమించిన తలసాని ఏకంగా 16.50లక్షల రూపాయలను సంపాదించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. వరంగల్‌లో జరిగే భారీ బహిరంగసభకు వెళ్ళే కార్య కర్తల ఖర్చుల నిమిత్తం కూలీ పనులు చేశానని అన్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌లో మూటలు మోసి రూ.5లక్షలు సంపాదించారు తలసాని. బేగంపేటలోని ప్రకాశ్‌ నగర్‌లో గల ఓ నిర్మాణంలో ఉన్న భవనానికి టైల్స్‌ మోశారు. దీనికి సదరు బిల్డర్‌ రూ.1లక్ష కూలీని మంత్రికి అందజేశారు.

సనత్‌నగర్‌లోని జెక్‌ కాలనీలో మట్టి మోసినందుకు విశ్వనాథరాజు.. మంత్రికి రూ.50వేలు అందజేశారు. లక్కీ హోటల్‌లో చాయ్‌ అమ్మినందుకు యజమాని జహంగీర్‌ రూ.25వేల నగదును అందజేశారు. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనే రమణ టిఫిన్‌ సెంటర్‌లో సర్వర్‌గా పని చేశారు. సూర్యశంకర్‌ రెడ్డి రూ.25వేలు, అనంతరెడ్డి రూ.25వేలు అందజేశారు.

talasani srinivas yadav earns Rs. 16.50lakhs for his work

లోదా అపార్ట్‌మెంట్‌ సమీపంలో రోడ్లను శుభ్రపరిచి నందుకు గాంధీప్రసాద్‌ రూ.50వేలను అందజేశారు. బీకేగూడలోని స్పెక్ట్రమ్‌ పబ్లికేషన్స్‌లో పుస్తకాలను విక్రయించినందుకు సంస్థ యజమాని మోహన్‌నాయుడు రూ.లక్షను కూలీగా ఇచ్చారు.

అమీర్‌పేటలోని పలు ప్రాంతాలలో ఇసుక మోయడం, తదితర పనులను చేసి లక్ష రూపాయలను సంపాదించారు. మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌ వాటర్‌ జోన్‌లోని టికెట్‌ కౌంటర్‌లో సందర్శకులకు టికెట్లను విక్రయంచారు. జలవిహార్‌ ఎండీ రామరాజు రూ.2.16 లక్షల రూపా యల కూలిని అందజేశారు.

మోండా మార్కెట్‌లో కూరగాయలు విక్రయించడంతో పాటు మటన్‌షాపులో మటన్‌ అమ్మడం ద్వారా లక్ష రూపాయలు, రాంగోపాల్‌పేట ప్రాంతంలోని చీరలు అమ్మటం, నగల షాపులో పని చేయడం ద్వారా 3.40 లక్షల రూపాయలను కూలీని సంపాదించారు.

పలు ప్రాంతాలలో పలు చోట్ల స్థానిక నాయకులతో కలిసి కూలి పనులలో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్లు శేషుకుమారి, లక్ష్మీ బాల్‌రెడ్డి, తరుణి, అరుణగౌడ్‌, రూప, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీహరి, బాల్‌రెడ్డి, సురేశ్‌గౌడ్‌, సరఫ్‌సంతోష్‌, చక్రధర్‌ యాదవ్‌, యాదగిరిచారి, కరుణాకర్‌రెడ్డి, నారాయణరాజు, పురుషోత్తం, ఖలీల్‌బేగ్‌, సబిత పద్మ, నరేందర్‌కుమార్‌, గుడిగె శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana Minister Talasani Srinivas Yadav on Tuesday earned Rs. 16.50lakhs for his work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X