హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కఠినం!: నెలకి రూ.20కోట్ల రాబడి తగ్గిందన్న తలసాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వాణిజ్య పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో నెలకు 20 కోట్లు రూపాయల మేర తగ్గిందని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వాణిజ్య పన్నుల ద్వారా రావాల్సిన నిర్దేశించిన ఆదాయాన్ని రాబట్టుకోవడానికి పన్నుల ఎగవేతదారుల నుంచి వసూలు చేయడానికి ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

సచివాలయం డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో తనకు కేటాయించిన చాంబర్‌లో మంత్రి తలసాని బుధవారం బాధ్యతలు చేపట్టారు. రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ సందర్భంగా హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో వాణిజ్య పన్నుల శాఖ ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు.

ప్రభుత్వానికి పన్నుల ద్వారా సమకూరే ఆదాయంలో సుమారు 70 శాతం వాణిజ్యి పన్నుల శాఖ నుంచే రాబడి వస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖకు నిర్దేశించిన రాబడి లక్ష్యం రూ.15,575 కోట్లుకాగా, ఇందులో నవంబర్ నాటికి రూ. 14,008 కోట్లు సాధించి లక్ష్యంలో 90 శాతానికి చేరుకుందన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పన్నులను క్రమబద్ధీకరిస్తామన్నారు.

దాంతోపాటు వ్యాపారులు, వినియోగదారులు స్వచ్చంధంగా పన్నులు చెల్లించే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ప్రస్తుతం పన్ను విధించే పరిధిని పెంచడంతో పాటు పన్నుల ఎగవేతను నివారించేందుకు ఇన్వాయిస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. వినోదపు పన్ను, వృత్తి పన్ను వంటి ఇతర పన్నులపై దృష్టిసారించడంతో పాటు నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఇన్ఫార్మర్లకు పారితోషికాలు ఇవ్వాలని యోచిస్తోన్నట్టు చెప్పారు.

తలసాని

తలసాని

సచివాలయం డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో తనకు కేటాయించిన చాంబర్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని బుధవారం బాధ్యతలు చేపట్టారు.

తలసాని

తలసాని

రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ సందర్భంగా హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

తలసాని

తలసాని

రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ సందర్భంగా హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందిస్తున్న మంత్రి తలసాని

తలసాని, పద్మారావు

తలసాని, పద్మారావు

గ్రేటర్ హైదరాబాద్ పట్టణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులను శాలువాతో సన్మానిస్తున్న నేతల దృశ్యం.

తలసాని

తలసాని

సచివాలయం డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో తనకు కేటాయించిన చాంబర్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపండితుల ఆశీర్వాదం తీసుకుంటూ..

తలసాని

తలసాని

సచివాలయం డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో తనకు కేటాయించిన చాంబర్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మానం.

తలసాని

తలసాని

సచివాలయం డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో తనకు కేటాయించిన చాంబర్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని బుధవారం బాధ్యతలు చేపట్టారు.

వన్ టైమ్ సెటిల్మెంట్ విధానం ద్వారా కోర్టులలో పేరుకు పోయిన పన్నుల వాజ్యం కేసులను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వస్తు సేవల పన్ను అమలు వ్యవస్థను సమాయత్తపరుస్తామన్నారు.

అందరికీ అనుకూలమైన, ఆమోదయోగ్యమైన పన్ను విధానాలకు రూపకల్పన చేయడం ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమన్నారు. అటు వినియోగదారులు, వ్యాపారులు ఇటు ప్రభుత్వం సమానంగా లాభపడే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు చిన్న సినిమాలను ప్రోత్సహిస్తామన్నారు.

English summary
Commercial Taxes Minister T. Srinivas Yadav has said that the government lost a revenue of Rs. 20 crore every month due to the slashing of petrol and diesel rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X