హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రుణమాఫీ కోసం రోడ్డుపైకి టీడీపీ, బీజేపీ: టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లక్షలోపు రైతుల రుణాలను ఏక మొత్తంలో మాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు మంగళవారం భారీ నిరసన ప్రదర్శనలు చేశారు. హైదరాబాద్ అబిడ్స్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీ సహా మరికొందరు నేతలను పోలీసులు అరెస్టు చేసి ఆబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతక ముందు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన నిరసన ప్రదర్శనలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీబీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎన్నికల ముందు లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కోసం రూ. 1000 కోట్లు మార్కెట్‌ ఫండ్‌ విడుదల చేస్తామని సీఎం హామీలు ఇచ్చారన్నారు. అనంతరం అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీలను మరిచిపోయారని విమర్శించారు.

ఖరీఫ్‌లో రైతులకు రూ. 15వేల కోట్ల వరకు రుణాలు అందిస్తామని ప్రకటించిన సర్కార్‌, వాస్తవంలో అయిదు వేల కోట్లయినా ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులకు 17వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ సర్కార్‌, ఇప్పటి వరకు సగం రుణాలూ కూడా మాఫీ చేయలేదని ధ్వజమెత్తారు.

రుణమాఫీ కోసం రోడ్డుపైకి టీడీపీ, బీజేపీ

రుణమాఫీ కోసం రోడ్డుపైకి టీడీపీ, బీజేపీ

ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సైతం రైతులకు దక్కలేదని, బ్యాంకులు వడ్డీ కింద జమ చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, రైతులను ఆదుకొని, ఆత్మహత్యలు నివారించేదాకా తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

 రుణమాఫీ కోసం రోడ్డుపైకి టీడీపీ, బీజేపీ

రుణమాఫీ కోసం రోడ్డుపైకి టీడీపీ, బీజేపీ

రాష్ట్రంలో కరువు ప్రాంతాలపై ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందించలేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆత్మహత్మలపై ప్రకటన చేయాలని కోరిన తమను ఏకంగా అసెంబ్లీ నుంచే గెంటేశారని అన్నారు.

 రుణమాఫీ కోసం రోడ్డుపైకి టీడీపీ, బీజేపీ

రుణమాఫీ కోసం రోడ్డుపైకి టీడీపీ, బీజేపీ

అనంతరం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఆబిడ్స్‌‌లోని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నేతి మురళీధర్‌ను కలిసి వినతి సమర్పించారు.

 రుణమాఫీ కోసం రోడ్డుపైకి టీడీపీ, బీజేపీ

రుణమాఫీ కోసం రోడ్డుపైకి టీడీపీ, బీజేపీ

కాగా, రైతులందరికి రుణమాఫీ చేయాలంటూ ఆదిలాబాద్‌ జిల్లా కడెం మండలం లింగాపూర్‌ ఎస్‌బీహెచ్‌ బ్యాంకు ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. రైతులను ఆదుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.

 గవర్నర్‌ను కలిసిన బీజేఎల్పీ

గవర్నర్‌ను కలిసిన బీజేఎల్పీ

రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ అంశాలపై మంగళవారం బీజేఎల్పీ నేత కె. లక్ష్మణ్‌ నేతృత్వంలో పార్టీ నేతల బృందం గవర్నర్‌ను కలిసింది. రైతులకు భరోసా కల్పించి.. వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపింది. వర్షాభావ పరిస్థితులు, రుణభారమే రైతుల ఆత్మహత్యకు ప్రధాన కారణమని తెలిపింది. ఏకమొత్తంగా రుణమాఫీ జరిగితేనే రైతులు బ్యాంకులనుంచి కొత్తగా రుణాలు పొందగలుగుతారని పేర్కొంది.

English summary
Telugu Desham party and BJP MLas demonstration against suicide of farmers other side KCR playing Bathukamma demonstration at Hyderabad collector office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X