వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనకిదేమైనా కొత్తనా: చంద్రబాబు, వెళ్లిపోండి.. సీతక్క ఉద్వేగం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో పార్టీని వదులుకోలేనని, ఇక్కడ పార్టీకి తాను అండగా ఉంటానని, గతంలో వచ్చిన గడ్డు రోజులతో పోలీస్తే ఇప్పటివి ఓ లెక్కే కాదని, కొందరు పోవడం వల్ల చాలా సమస్యలు తగ్గాయని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

గురువారం హైదరాదాబాద్‌లో ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. టిడిపికి కార్యకర్తలే బలమని, కార్యకర్తలు వెన్నంటి ఉన్నంత కాలం పార్టీ ఉంటుందన్నారు. ఎన్నికల ఫలితాలు, కొందరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరికలను చూసి అధైర్యపడ వద్దన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ, నిర్దిష్ట ప్రణాళికతో పార్టీని బలోపేతం చేద్దామన్నారు. గ్రేటర్ ఎన్నికల అనంతరం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెరాసలోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో సమావేశం జరిగింది.

తెలంగాణ టిడిపి అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఫిరాయింపుదారుల సంతాప సభ అని టిడిపి నేతలు కొందరు అభివర్ణించారు. టిడిపిలో ఇంకా కోవర్టులు ఉంటే వెళ్లిపోవాలని మాజీ ఎమ్మెల్యే సీతక్క ఉద్వేగంతో మాట్లాడారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

చంద్రబాబు మాట్లాడుతూ... అనేక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న ఏకైక పార్టీ తెలుగుదేశమన్నారు. కార్యకర్తలు బలంగా ఉన్నారని నాయకులు పరస్పరం సహకరించుకుని ముందుకు వెళ్లాలన్నారు. టిడిపి ఆవిర్భవించి మార్చి నాటికి 34 ఏళ్లు పూర్తి చేసుకుంటోందన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

మనం గెలిపించిన వ్యక్తులు పార్టీని వీడటం బాధాకరమని, అయినా ఒకరిద్దరు నాయకులు వెళ్లినా సమస్య లేదన్నారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని, ఓటమికి వెరవకుండా ముందుకు వెళ్లాలన్నారు. 1987లో ఇద్దరు ఎంపీలే ఉన్న బిజెపి తర్వాత రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగిందని, 2009 జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోటీ చేయని టిఆర్ఎస్ ఈసారి మెజార్టీ సీట్లను సాధించిందన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

డిఎంకె అధికారంలో ఉన్నపుడు ఎఐడిఎంకె ఒకసారి ఉప ఎన్నికల్లో పోటీనే చేయలేదన్నారు. టిడిపి పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనేక సమస్యలు ఎదుర్కొందన్నారు. అనేక మంది కార్యకర్తలను చంపారని, ఆస్తులపై దాడులు చేశారని పేర్కొంటూ సంక్షోభాలను అవకాశంగా మలుచుకోవాలన్నారు.

 తెలుగుదేశం

తెలుగుదేశం

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికలు పరీక్షలాంటివని స్పష్టంచేస్తూ పార్టీని మళ్లీ తెలంగాణలో బలోపేతం చేద్దామని చంద్రబాబు చెప్పారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సరిగ్గా చేయలేకపోయామని, సరైన ఫలితాలు సాధించలేకపోయామని అభిప్రాయపడ్డారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గైర్హాజరయ్యారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టిడిపి శాసనసభా పక్ష నేతగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు శాసనసభ స్పీకర్‌కు చంద్రబాబు గురువారం రాత్రి లేఖ రాశారు. టిడిపి శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి దయాకర రావు కొన్నాళ్లుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పార్టీ నుంచి ఆయనను సస్పెండ్‌ చేశామని, ఆయన స్థానంలో రేవంత్ రెడ్డిని నియమిస్తున్నామని అందులో పేర్కొన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

తెలంగాణ టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొడంగల్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శాసనసభలో ఉపనేతగా ఆయన వ్యవహరించారు.

 తెలుగుదేశం

తెలుగుదేశం

ఇదిలా ఉండగా, టిఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆకర్షితులయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే పదిమంది టిడిపి ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. ఇప్పుడు టిఆర్ఎస్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలోను ఇద్దరు తెరాసలోకి జంప్ అవుతారని చెబుతున్నారు.

English summary
Unperturbed by the recent defection of his party’s MLAs into the TRS, TD supremo N. Chandrababu Naidu on Thursday said that the TD was the only party in the country that can withstand any crisis and convert a crisis into success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X