వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెర వెనక: సండ్రదే కీలక పాత్ర, కొత్తగా 'జనార్ధన్', సెబాస్టియన్‌తో ఫోన్లో ఇలా..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టైన సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ నివేదికలో ఏసీబీ కీలక విషయాలు పొందుపర్చిందని తెలుస్తోంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌తో సండ్ర 32 సార్లు ఫోన్‌లో మాట్లాడారని, స్టీఫెన్ సన్‌ను ప్రభావితం చేసే కుట్రలో సండ్ర కీలక పాత్ర పోషించారని పేర్కొంది.

విచారణ నుంచి తప్పించుకునేందుకు సండ్ర రాజమండ్రి ఆస్పత్రిలో చేరారని, సండ్ర డ్రైవర్‌ను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంది. సండ్ర ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని, ఇప్పటి వరకు ఈ కేసులో 13 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని చెప్పింది.

సెబాస్టియన్, సండ్రల ఫోన్ సంభాషణలను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. సండ్ర సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పింది. మే 27 నుంచే కొనుగోలు యత్నాలు జరిగాయని చెప్పింది.

TDP MLA held in cash for vote case

రేవంత్ రెడ్డితో 18 సార్లు సండ్ర ఫోన్‌లో మాట్లాడారని, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమంతా మోతీ నగర్, సికింద్రాబాద్‌ల చుట్టే తిరిగిందని పేర్కొంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌తో పాటు అక్కడున్న క్యాంటీన్లలో భేటీ జరిగిందని, డ్రైవర్ల ఎంపికలోనూ సండ్ర, సెబాస్టియన్ జాగ్రత్త పడ్డారని పేర్కొంది.

ఈ వ్యవహారంలో సండ్ర తెర వెనుక ఉన్నారని తెలిపింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సెబాస్టియన్ సాయంను తీసుకున్నారని, ఏఏ ఎమ్మెల్యేలు డబ్బులకు లొంగుతారో సండ్ర ఎంక్వైరీ కూడా చేశారని, మహానాడు వేదికల్లోనూ కుట్ర సంభాషణలు, బాస్‌తో మాట్లాడి డబ్బులు సమకూరుస్తానని సండ్ర చెప్పారని పేర్కొన్నారు.

సండ్ర, సెబాస్టియన్ సంభాషణల్లో చాలాసార్లు జనార్ధన్ పేరు వినిపించిందన్నారు. ఏ పని చేసినా జనార్ధన్‌కు సండ్ర, సెబాస్టియన్ అప్‌డేట్ చేశారని, ఎప్పటికప్పుడు రిపోర్టుపై సెబాస్టియన్ సండ్రకు సందేశాలు పంపించారంటూ.. ఏసీబీ వారు వాడిన ఫోన్ నెంబర్లు సైతం ఇచ్చింది.

సండ్ర, సెబాస్టియన్ మధ్య ఓ ఫోన్ సంభాషణగా చెబుతూ మీడియాలో వచ్చింది.

సెబాస్టియన్: ఎమ్మెల్యే గారా అండి!

సండ్ర: ఏమైంది
సెబాస్టియన్: హా ఎమ్మెల్సీ
సండ్ర: ఎలక్షన్స్‌లో పేటెంట్ ఆయనకు ఓటు హక్కు ఉండాలి
సెబాస్టియన్: అవును
సండ్ర: ఆయన మనకు డబ్బుకు లొంగుతాడేమో మన పార్టీకి సహకరించమని అడగాలి
సెబాస్టియన్: హో అదా
సండ్ర: ఎందుకంటే ఆయనకు భవిష్యత్ రాజకీయాలు అవసరం లేదు కదా. మేమంటే ఎలక్షన్స్‌లో గెలవాలి. ఒకసారి నామినేట్ అయిపోతే అయిపోతుంది కదా.. డబ్బు ముఖ్యం కదా ఆయనకు
సెబాస్టియన్: అదైతే కరెక్ట్
సండ్ర: ఆ ష్యూర్ మనకు కావాలి

సెబాస్టియన్: హో మనకు ఎంత టైమ్ ఉంది సార్
సండ్ర: మనకు ఒకటవ తారీఖు పోలింగ్ ఉంది
సెబాస్టియన్: సరే.. ఈ లోపల మనం ట్యాప్ చేయాలి
సండ్ర: హా ఈ లోపల ట్యాప్ చేసి ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తే
సెబాస్టియన్: సరే సార్. ఆయనకు ఎక్కడైనా హోటల్‌లో టైం ఇద్దామా.. మాట్లాడానికి

సండ్ర: హా.. మీరు ఆయన దగ్గర ఎలాగైనా డీల్ చేసి సక్సెస్ కావాలి.. ఫెయిల్ అవొద్దు
సెబాస్టియన్: హో ఆ రెస్పాన్స్‌బులిటీ మరి మీరు తీసుకుంటారా సార్.. నేను మాట్లాడుతాను. ఇన్‌కేస్ లేదు అంటే ఎట్లా.. ఎస్కేప్ చేపించాలి మనం.. ఆ రోజే ఆయనకు ఏ బాంబేనో.. కోల్‌కతా వెళ్లిపోయేట్లుగా ఏర్పాట్లు చేయాలి. అబ్సెంట్ అయినా పర్వాలేదు కదా ఓటింగ్‌కు
సండ్ర: ఆబ్సెంట్ కంటే కూడా ముందు ముందు మీరు ఫస్ట్ ఓటుకే అడగండి.. లేకపోతే ఆబ్సెంట్ అడగండి.. ఓటు అడగండి.. ఓటు కావాలి.
సెబాస్టియన్: ఓకే ఓటే కావాలి
సండ్ర: అవును

సెబాస్టియన్: సరే సరే. నేను నాకిప్పుడు అంటే ఈ రెండు రోజులు మన మహానాడు బిజీ కదా సార్.. ఐనా కూడా నేను.
సండ్ర: మహానాడు ఉన్నది నేను సపరేట్ పర్మిషన్ తీసుకుంటాను.
సెబాస్టియన్: ఆ ఆ సార్..
సండ్ర: నాకు రేపటికి కావాలి
సెబాస్టియన్: సరే సరే.. రేపు మార్నింగ్ అక్కడికి వస్తున్నాను
సండ్ర: ఆ..

సెబాస్టియన్: ఎన్టీఆర్ ఘాట్‌కు వస్తున్నాను ప్రేయర్ చేయడానికి.. సార్ రమ్మన్నారు.. ఏమో సార్ 7 గంటలకు రమ్మన్నారు నన్ను
సండ్ర: ఆ ఓకే మీరు మీ పని చూసుకోండి మిగతా పని తర్వాత చూద్దాం
సెబాస్టియన్: ఒకే సార్ మంచిది.. నేను టచ్‌లో ఉంటా మీకు ఓకే
సండ్ర: థాంక్యూ..
సెబాస్టియన్ : థాంక్యూ థాంక్యూ సార్.

ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో కొత్తగా జనార్ధన్ పేరు వచ్చింది. ఈ కేసులో ప్రతి విషయం ఆయన దృష్టికి వెళ్లిందని, ఆయన ఎవరన్న విషయాన్ని తేల్చాల్సి ఉందని ఏసీబీ తెలిపింది.

English summary
TDP MLA held in cash for vote case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X