వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయపడేది కెసిఆర్‌కా, నో: టిడిపి నేతలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో కరెంట్‌ కోతలకు కేసీఆర్‌ అసమర్థతే కారణమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌తో ఎర్రబెల్లి, ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు భేటీ అయి రైతుల సమస్యలపై ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో రైతాంగం కరెంట్‌ లేక అల్లాడుతోందని, కరెంట్‌ ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. కరెంటు సక్రమంగా ఇవ్వలేని అసమర్థుడు కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉండటానికి కె చంద్రశేఖర రావుకు అర్హత ఉందా అని నేతలు ప్రశ్నించారు.

రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం, ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించలేదని నేతలు దుయ్యబట్టారు. రైతులకు మద్దతు ధర అందడం లేదని, ధాన్యం ధర క్వింటా రూ. వెయ్యికి పడిపోయిందన్నారు.

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌కు ఫిర్యాదు

తెలంగాణలో రైతు సమస్యలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రావరం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు వినతి పత్రం సమర్పించారు.

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌కు ఫిర్యాదు

తెలంగాణలో రైతు సమస్యలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రావరం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు వినతి పత్రం సమర్పించారు.

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌కు ఫిర్యాదు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంట నష్టం కలిగిందని, ఎకరాకు రూ.30వేలు పరిహారం ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌కు ఫిర్యాదు

రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమంటూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పత్తి కొనుగోలు సీసీఐకి ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌కు ఫిర్యాదు



మంత్రి జగదీశ్వర్‌రెడ్డి రెచ్చగొట్టడం వల్లే నల్గొండ జిల్లాలోతమ పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారని, వెంటనే జగదీష్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు అన్నారు.

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌కు ఫిర్యాదు

మెసేజ్‌లతో కార్యకర్తలను రెచ్చగొట్టిన తెరాస శాసనసభ్యుడు జూపల్లి కృష్ణారావుపై కేసు నమోదు చేయాలని, మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు డిమాండ్‌ చేశారు. టీడీపీని ఇబ్బంది పెట్టాలనేదే కేసీఆర్‌ ఆలోచన అని వారన్నారు.

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌కు ఫిర్యాదు

తెలంగాణలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోలేదని, రైతులను ఓదార్చినందుకే తమపై దాడి చేస్తారా అని తెలుగుదేశం తెలంగాణ నేతలు ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ తప్ప ఎవరూ ఉండొద్దనుకుంటున్నారని, కేసీఆర్‌ ఉడత ఊపులకు భయపడేది లేదని టీటీడీపీ నేతలు స్పష్టం చేశారు.

English summary
TDP Telangana MLAS Submited Memorandum to ESL Narasimhan at Raj Bhavan accusing K chandrasekhar Rao government on farmers' plight in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X