వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అందుకే టిడిపితో పొత్తువద్దు, ఎన్ డి ఏ లోకి టిఆర్ఎస్ కు ఛాన్స్ లేదు, కెసిఆర్ కు భయం'

తెలంగాణలో టిడిపి బలహీనపడింది. తెలంగాణ రాష్ట్రంలో టిడిపి అవసరం లేదనే భావన ప్రజల్లో ఉంది. అందుకే ఆ పార్టీతో పొత్తును వద్దనుకొంటున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.తెలంగాణలో టిఆర

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో టిడిపి బలహీనపడింది. తెలంగాణ రాష్ట్రంలో టిడిపి అవసరం లేదనే భావన ప్రజల్లో ఉంది. అందుకే ఆ పార్టీతో పొత్తును వద్దనుకొంటున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.తెలంగాణలో టిఆర్ఎస్ ను ఎదుర్కొని నిలబడిన పార్టీ బిజెపి ఒక్కటేనని చెప్పారు.అందుకే రానున్న రోజుల్లో బిజెపిలో చాలామంది చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. అమిత్ షా పర్యటనతోనే కెసిఆర్ కు అసహనం పెరిగిపోయిందన్నారు.మోడీ, యోగి వచ్చి ప్రచారం చేస్తే కెసిఆర్ అడ్రస్ గల్లంతు అవుతోందన్నారు.

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ను తెలుగు న్యూస్ ఛానల్ ఎన్ టీ వి ఇంటర్వ్యూ చేసింది.ఈ ఇంటర్వ్యూలో రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ చేపట్టిన వ్యూహారచనను ఆయన వివరించారు.

తెలంగాణలో మూడు రోజుల పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించారు.ఈ పర్యటనతోనే కెసిఆర్ భయం పట్టుకొందన్నారు. ఈ భయంతోనే అమిత్ షాపై నోటికొచ్చినట్టు మాట్లాడినట్టు విమర్శించారు.

2019 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహారచన చేస్తున్నట్టు చెప్పారు. ఇతర పార్టీల నుండి చాలామంది నాయకులు తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో అమిత్ షా పర్యటన తర్వాత తెలంగాణలో రాజకీయాల్లో మార్పులుచోటుచేసుకోనున్నాయని చెప్పారు.

టిడిపి బలహీనపడింది

టిడిపి బలహీనపడింది

తెలంగాణలో టిడిపి బలహీనపడింది. పొత్తు అనేది రెండు పార్టీలకు ప్రయోజనం కల్గించాలి. కానీ, తెలంగాణలో టిడిపి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 15 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో గెలిస్తే ఇధ్దరు మాత్రమే మిగిలి ఉన్నారని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ ను ఎదుర్కొనేశక్తి బిజెపికే ఉందన్నారు. తెలంగాణలో టిడిపి అవసరం లేదనే భావన ప్రజల్లో ఉందన్నారు. అందుకే ఆ పార్టీ బలహీనపడిందన్నారు.బలహీనపడిన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు.

 ఎన్ డి ఏలోకి టిఆర్ఎస్ కు నో ఛాన్స్

ఎన్ డి ఏలోకి టిఆర్ఎస్ కు నో ఛాన్స్


ఎన్ డి ఏ లోకి టిఆర్ఎస్ చేరాలనే ఆలోచన లేదన్నారు. మజ్లిస్ ను నెత్తినపెట్టుకొన్న కెసిఆర్ ను ఎన్ డి ఏ లో చేర్చుకొంటారని ఆయన ప్రశ్నించారు.అంతేకాదు మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టిఆర్ఎస్ తాకట్టు పెట్టిందని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ కు బిజెపి మద్య రహస్య ఎజెండా లేదన్నారు. టిఆర్ఎస్ ను చీల్చే ఆలోచన తమకు లేదన్నారు.అంతేకాదు కెసిఆర్ ను బ్లాక్ మెయిల్ చేసే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.తెలంగాణ ప్రజలను కించపర్చేలా బిజెపి నిర్ణయం తీసుకోదన్నారు లక్ష్మణ్

అమిత్ షా చెప్పింది వాస్తవాలు

అమిత్ షా చెప్పింది వాస్తవాలు

రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి లక్షకోట్లు ఇచ్చినట్టు చెప్పిన చేసిన ప్రకటన వాస్తవమేనన్నారు. కెసిఆర్ చెప్పినట్టుగానే 67 వేల కోట్లను ఇప్పటికే కేంద్రం ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జాతీయ రహదారులకోసం 47 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని కెసిఆర్ అసెంబ్లీనే ఒప్పుకొన్నారని చెప్పారు. అయితే ఈ విషయాలు చెప్పినందుకు కెసిఆర్ అమిత్ షా పై ఉపయోగించిన భాష సరిగా లేదన్నారు.

తెలంగాణ ప్రజలు అవమానపడేలా ఈ బాష ఉందన్నారు.దళితులను సిఎం చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనత కెసిఆర్ దే అని ఆయన చెప్పారు డిప్యూటీ సిఎంను పదవినుండి తొలగించిన ఘనత ఎంత కెసిఆర్ దేనని చెప్పారు.

సెప్టెంబర్ లో అమిత్ షా పర్యటనలో వలసలు

సెప్టెంబర్ లో అమిత్ షా పర్యటనలో వలసలు

ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున తమ పార్టీలోకి వలసలు వచ్చేందుకు నాయకులు సన్నద్దమయ్యారని చెప్పారు.ఈ మేరకు చాలామంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో అమిత్ షా పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రానున్నాయని చెప్పారు.మూడేళ్ళకాలంలో మోడీ విధానాలను నచ్చి అనేకమంది పార్టీలో చేరనున్నారని ఆయన చెప్పారు.

మాది ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసం కాదు

మాది ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసం కాదు


తెలంగాణలో అధికారంలో వస్తామనేది ఆత్మవిశ్వాసమనేది చెబుతున్నట్టు లక్ష్మణ్ చెప్పారు. అతి విశ్వాసంతో చెప్పడం లేదన్నారు. మూడేళ్ళ మోడీ పాలన, తెలంగాణలో కెసిఆర్ పాలన గురించి ప్రతి ఇంటికి ప్రచారం చేస్తామని చెప్పారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలను అవమానపర్చేవిధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రావడానికి ముందు కలలను కెసిఆర్ వమ్ముచేశారని ఆయన ఆరోపించారు. ప్రతి బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తామని చెప్పారు.ఈ ప్రచారం వల్ల పార్టీని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించనున్నట్టు చెప్పారు.

 ప్రజలంతా కెసిఆర్ వైపు ఉంటే ఎన్నికలకు వెళ్ళాలి

ప్రజలంతా కెసిఆర్ వైపు ఉంటే ఎన్నికలకు వెళ్ళాలి

ప్రతి సర్వేలో కెసిఆర్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రాష్ట్రంలో అన్ని సీట్లు తామే గెలుచుకొంటామని కెసిఆర్ చెబుతున్నారు. నిజంగా అదే నిజమైతే పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదే పదే ఉప ఎన్నికలకు కారణమైన కెసిఆర్ ఎందుకు ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళడం లేదన్నారు. సర్వేల పేరుతో ప్రజలను కెసిఆర్ మోసం చేస్తున్నారని చెప్పారు.

English summary
Tdp weaken in Telangana said Bjp Telangana state president Laxman.Telugu news channel interviewed him. he explained how to strengthen party in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X