హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వన్ సైడ్ లవ్: లేడీ టెక్కీ కాబోయే భర్తకు అసభ్యకరమైన ఫొటోలు...

తనకు సన్నిహితంగా మెలిగిన ఓ యువతిపై టెక్కీ పగబడ్డాడు. తనను పెళ్లి చేసుకోనని చెప్పిన పాపానికి ఆమెను వేధించడం ప్రారంభించాడు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనకు సన్నిహితంగా మెలిగిన ఓ యువతిపై టెక్కీ పగబడ్డాడు. తనను పెళ్లి చేసుకోనని చెప్పిన పాపానికి ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమెకు కాబోయే భర్తకు అసభ్యకరమైన ఫొటోలు పంపించి పెళ్లిని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు.

బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్న యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది.

ఈ యువతికి, ఆమెకు కాబోయే భర్తకు ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి అశ్లీల, అభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలు వెళ్లాయి. ఈ విషయంపై బాధిత యువతి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఆ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపిస్తుం ది వనపర్తికి చెందిన పవన్‌కుమార్‌గా గుర్తించారు. విచారణలో అతను బాధిత యువతికి స్నేహితుడని తేలింది.

Techie threatens his former love, nabbed

2013 మొయినాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ యవతి బీటెక్ (ఈసీఈ) మొదటి సంవత్సరం చదివింది. ఆ సమయంలో అదే కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తున్న పవన్‌కుమార్ పరిచయమైయ్యాడు. ఈ పరిచయంతో ఇద్దరు కలిసి తిరిగారు. ఈ అవకాశాన్ని అనువుగా మల్చుకున్న పవన్‌కుమార్ ఆమెకు తెలియకుండా ఫోన్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేశాడు.

తాను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని అతను చాలా సార్లు ఆ లేడీ టెక్కీకి చెప్పాడు. పవన్‌కుమార్ ప్రవర్తనను నచ్చని యువతి అతన్ని దూరంగా పెట్టింది. అదే సమయంలో ఆమెకు వివాహం నిశ్చయమైందని తెలుసుకుని పవన్‌కుమార్ ఆ యువతిపై పగ బట్టాడు. పెళ్లిని ఏలాగైనా చెడగొట్టాలని యువతి ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసిన సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఆమె ఫేస్‌బుక్ ఐడీతో పాటు సెల్‌ఫోన్‌లోని చాలా అంశాలను హ్యాక్ చేశాడు.

దీంతో యువతి చేసుకోబోయే వరుడి వివరాలను తెలుసుకుని అతనికి, యువతిని అవమానపర్చే విధంగా ఫొటోలు, వీడియోలు పంపినట్లు దర్యాప్తులో తేలింది. అతని నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను సేకరించి రిమాండ్‌కు తరలించారు.

English summary
Cyberabad police arrested a techie for threatening his former girlfriend that he would share their private pictures on social media. Police said that S. Pavan Kumar started harassing the woman, a techie, who had rejected him and shared their pictures with her fiance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X