హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్ర సాధన: కెసిఆర్

స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.

71వ, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Telangana CM KCR hoisted the National Flag at Golconda Fort

కొత్తగా ఏర్పాటైనప్పటికీ కూడ తెలంగాణ రాష్ట్రం త్వరగానే కుదురుకొందన్నారు.సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తోందన్నారు. గతంలో ఇతర రాష్ట్రాలు ఈ తరహలో త్వరగా కుదురుకోలేదని ఆయన గుర్తుచేశారు.

సమానత్వం, సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణ వల్లే ఈ ఫలితం వచ్చిందన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటిని అందించేందుకుగాను మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్టు కెసిఆర్ చెప్పారు.

Recommended Video

KCR lays Foundation Stone of Developmental works in Muduchintalapally

నిరుపేద ఆడపిల్లల వివాహం కోసం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను తీసుకు వచ్చినట్టు చెప్పారు. ఈ ఏడాది నుండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలీవరి చేసుకొన్న మహిళలకు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు చెల్లిస్తున్నట్టు చెప్పారు.

విద్యుత్ కష్టాలను అధిగమించేందుకుగాను ఎంతగానో శ్రమించినట్టు చెప్పారు. గృహవినియోగదారులకు 24 గంటలపాటు సరఫరా చేస్తున్నట్టు కెసిఆర్ చెప్పారు.

విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం విద్యుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆవిర్భవించనుందని కెసిఆర్ చెప్పారు.

అనంతరం పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించినవారికి కెసిఆర్ సన్మానించారు.

English summary
Telangana Chief Minister K. Chandrasekhar Rao hoisted the national flag at a colourful ceremony at the historic Golconda Fort on Tuesday.Telangana government celebrated Independence day at Golconda fort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X