వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త జిల్లాలు - కొలువుల జాతర: ఎన్ని ఉద్యోగాలు, ఏ శాఖలో.. ఇవీ వివరాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలు ఏర్పడి.. మొత్తం 31 జిల్లాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల జాతర ప్రారంభం కానుంది. 21 కొత్త జిల్లాలకు అధికారులు కావాల్సి ఉంది. కాబట్టి రెవెన్యూ శాఖలో 2019 ఉద్యోగాలకు పచ్చ జెండా ఊపారు. విద్యా శాఖలో 85 ఎంఈవో పోస్టులకు ఉత్తర్వులు ఇచ్చారు.

రాష్ట్రంలో ఈ నెల 11న కొత్తగా 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాల్లో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని అదనంగా నియమించాల్సి ఉంది. కావు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పరిధిలో కొత్తగా 2109 ఉద్యోగాలను సృష్టించారు.

ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరు చేసిన వాటిలో జిల్లా కలెక్టరేట్లలో 693 పోస్టులు, ఆర్డీవో కార్యాలయాల్లో 188, మండల రెవెన్యూ కార్యాలయాల్లో 1,228 పోస్టులున్నాయి. నేరుగా నియమించే పద్ధతిలో వీటిని భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.

telangana

వీటిలో కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేసినా అత్యధిక పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారానే భర్తీ కానున్నాయి. అదే విధంగా రాష్ట్రంలో 85 మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓ) పోస్టులను కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది.

పాఠశాల విద్యాశాఖ సంచాలకుల పరిధిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కొత్త ఎంఈఓ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 125 కొత్త మండలాల ఏర్పాటు నేపథ్యంలో కొత్తగా ఎంఈఓ పోస్టుల్ని సృష్టించారు.

వీటితో పాటు రోడ్స్ అండ్ బిల్డింగ్స్‌లో 12 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. కొత్త జిల్లాల కలెక్టరేట్లలో 693, రెవెన్యూ డివిజన్లలో 188 పోస్టులు, రెవెన్యూ మండళ్లలో 1228 పోస్టులు. 98 తహసీల్దారు, 180 సీనియర్ అసిస్టెంట్లు, 139 ఆఫీస్ సబార్డినేట్లు.

జిల్లా కార్యాలయాల్లో ఖాళీలు ఇవీ..

డీఆర్వో (జిల్లా రెవెన్యూ ఆఫీసర్) - 12
తహసీల్దారు - 98
డిప్యూటీ తహసీల్దారు - 4
సీనియర్ అసిస్టెంట్లు - 180
సీనియర్ స్టెనోలు - 21
జూనియర్ అసిస్టెంట్లు - 60
జూనియర్ స్టెనోలు - 21
రికార్డ్ అసిస్టెంట్లు - 42
డ్రైవర్లు - 42
జమేదార్లు - 21
ఆఫీస్ సబార్డినేట్లు - 139
చౌకీదార్లు/వాచ్ మెన్లు - 53

జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ ఆఫీసుల్లో ఖాళీలు ఇవీ..

డిప్యూటీ కలెక్టర్లు (ఆర్డీవో) - 24
డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ - 24
డిప్యూటీ తహస్లీదార్లు - 6
సీనియర్ అసిస్టెంట్లు - 12
జూనియర్ అసిస్టెంట్లు - 2
రికార్డ్ అసిస్టెంట్లు - 24
డ్రైవర్లు - 24
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే - 24
చైన్ మెన్ - 24
డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ - 24

రెవెన్యూ మండలాల్లో ఖాళీలు ఇవీ..

తహసీల్దార్లు - 104
డిప్యూటీ తహసీల్దార్లు - 104
మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు - 232
జూనియర్ అసిస్టెంట్లు - 120
మండల సర్వేయర్లు - 120
ఆఫీస్ సబార్డినేట్స్ - 308
మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ - 120
చైన్ మెన్ - 120

English summary
After the creation of 21 new districts, the Telangana government has approved 2,019 new jobs in the revenue department besides 85 in school education and 12 in the roads and buildings department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X