వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ సెకండియర్‌లో బాలికలదే హవా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు సోమవారం ఉదయం విడుదలయ్యాయి. ఉమ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ పరీక్షల్లో మొత్తం 61.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. నిరుటితో పోలిస్తే ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ ఫలితాల్లోనూ అమ్మాయిలే టాప్‌గా నిలిచారు.

సెకండియర్‌ పరీక్షల్లో 3,78,973 విద్యార్థులు హాజరు కాగా 2,32,742 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 66.86 కాగా, అబ్బాయిలు 55.91 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో రంగారెడ్డి జిల్లా(75శాతం) అగ్రస్థానంగా నిలవగా, నల్గొండ జిల్లా(50శాతం) చివరి స్థానంలో నిలిచింది. అలాగే రెండోస్థానంలో హైదరాబాద్‌, ఖమ్మం(64శాతం) నిలిచాయి.

 Telangana Inter second year results released

మే 25 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 6వ తేదీ వరకు సప్లిమెంటరీ ఫీజు గడువు ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పేదరికంతో చదువుకోలేక ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించలేదని అంటూ ఫెయిల్ అయిన విద్యార్థులకు మేలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. మూడు వారాల పాటు హాస్టల్ వసతితో పత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

మే 4 నుంచి మే 22 వరకు తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సిలబస్‌లో విద్యార్థుల డౌట్స్ తీర్చేలా శిక్షణ ఉంటుందని చెప్పారు.

English summary
Telangana deputy CM Kadiyam srihari has released intermediate second year results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X