వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలాసాలకోసమే మెడికో శ్రీకాంత్‌గౌడ్ కిడ్నాప్, సినీ ఫక్కిలోనే, నిందితులపై కాల్పులు

ట్టకేలకు మెడికో అక్కల శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాప్ కథ సుఖాంతమైంది. శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన ప్రమోద్ అతని అనుచరులు రూ.5 కోట్లను ఓలా యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ డబ్బును చెల్లించేందుకు ఓలా యాజ

By Narsimha
|
Google Oneindia TeluguNews

గద్వాల: ఎట్టకేలకు మెడికో అక్కల శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాప్ కథ సుఖాంతమైంది. శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన ప్రమోద్ అతని అనుచరులు రూ.5 కోట్లను ఓలా యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ డబ్బును చెల్లించేందుకు ఓలా యాజమాన్యం చెల్లించేందుకు అంగీకరించినట్టు సమాచారం.అయితే పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి..సినీ ఫక్కిలోనే నిందితులు వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు.

గద్వాల మెడికో శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాపర్ చెరనుండి రక్షించిన పోలీసులుగద్వాల మెడికో శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాపర్ చెరనుండి రక్షించిన పోలీసులు

ఈ నెల 6వ, తేదిన న్యూఢిల్లీలో డాక్టర్ శ్రీకాంత్‌ను ఓలా క్యాబ్ డ్రైవర్ ప్రమోద్ కిడ్నాప్ చేశారు. అయితే బుదవారం సాయంత్రం మీరట్‌లో ఉన్న దాచిన శ్రీకాంత్‌ను పోలీసులు సురక్షితంగా రక్షించారు.

రెండువారాలుగా శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూశారు. అయితే పోలీసులు సురక్షితంగా శ్రీకాంత్‌ను రక్షించారు. కిడ్నాపర్లు ఓలా క్యాబ్ యాజమాన్యంతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో డబ్బులు డిమాండ్ చేశారు.

ఢిల్లీలో కిడ్నాప్‌కుగురైన మెడికో శ్రీకాంత్‌గౌడ్ కేసులో పురోగతిఢిల్లీలో కిడ్నాప్‌కుగురైన మెడికో శ్రీకాంత్‌గౌడ్ కేసులో పురోగతి

అయితే పోన్లు చేసిన తర్వాత బస చేసిన ప్రాంతాన్ని మార్చేవారు. పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలను తీసుకొన్నారు. తప్పుడు ధృవపత్రాలతో ప్రమోద్ ఓలాలో ఉద్యోగం పొందాడు.

విలాసాలకు డబ్బులకోసం కిడ్నాప్

విలాసాలకు డబ్బులకోసం కిడ్నాప్

విలాసాలకు అలవాటుపడిన ప్రమోద్ సులభంగా డబ్బులు సంపాదించాలనే కోరికతోనే కిడ్నాప్ ప్లాన్ చేశాడు.రెండు వారాలుగా శ్రీకాంత్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమించారు. శ్రీకాంత్ ప్రాణం వేల కోట్ల రరూపాయాల విలువైన ఓలా కంపెనీ ప్రతిష్టతో ముడిపడింది. ఢిల్లీపోలీసులు అత్యంత జాగ్రత్తగా సంయమనంతో కదులుతూ ఈ కిడ్పాన్ మిస్టరీని చేధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రమోద్‌గా గుర్తించారు. ప్రమోద్ విలాసాలకు అలవాటుపడ్డారు. భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొన్నాడు. ఈ మేరకు క్యాబ్ సర్వీస్ ఉత్తమమని భావించాడు. ఓలాడ్రైవర్‌గా చేరి హైఫ్రోఫైల్ ప్యాసెంజర్ ఒకరిని కిడ్నాప్ చేయాలని నిశ్చయించుకొన్నాడు. ఓలాలో చేరిన రెండోరోజే శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాప్ చేశాడు ప్రమోద్.

డాక్టర్‌గా గుర్తించి కిడ్నాప్

డాక్టర్‌గా గుర్తించి కిడ్నాప్

ఓలాలో డ్రైవర్‌గా చేరిన ప్రమోద్ శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాప్ చేసిన రోజు 9రైడ్స్ ఇచ్చినా తీసుకోలేదు. పదోరైడ్ డాక్టర్ శ్రీకాంత్ రైడ్ ను ఒప్పుకొన్నాడు. శ్రీకాంత్‌ను డాక్టర్‌గా గుర్తించడంతోనే ప్రమోద్ ఆయన రైడ్‌కు ఒప్పుకొన్నాడు. పేరుకు ముందు డాక్టర్ ఉన్న విషయాన్ని గుర్తించి ఆయనను కిడ్నాప్ చేస్తే ఎక్కువ డబ్బులను డిమాండ్ చేయవచ్చని ప్రమోద్ భావించాడు. దీంతో శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేశారు. శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసి మీరట్‌లోని తన స్నేహితుడి ఇంట్లో దాచిపెట్టాడు.

పోలీసులను గందరగోళపరిచిన కిడ్నాపర్

పోలీసులను గందరగోళపరిచిన కిడ్నాపర్


హరిద్వార్, ముజఫర్‌నగర్ వంటి వేర్వేరు ప్రాంతాల నుండి కిడ్నాపర్ ఓలా యాజమాన్యానికి ఫోన్ చేసేవాడు. పోన్ చేసిన వెంటనే తన మకాన్ని మార్చేవాడు.ఈ రకంగా పోన్‌కాల్స్‌తో పోలీసులను గందరగోళపర్చాడు. పోలీసుల నుండి రక్షించుకొనేందుకు వెంట వెంటనే తాము ఉన్న చోటును మార్చేవాడని పోలీసులు ప్రకటించారు. అయితే నిందితులు వేసిన ప్లాన్‌కు పోలీసులు కూడ వ్యూహత్మకంగా వ్యవహరించడంతో శ్రీకాంత్‌ను సురక్షితంగా విడుదలయ్యాడు.

సినీ ఫక్కీలోనే... పోలీసుల కాల్పులు

సినీ ఫక్కీలోనే... పోలీసుల కాల్పులు

ఢిల్లీ, యూపీ పోలీసులు వ్యూహత్మకంగా వ్యవహరించారు. కిడ్నాపర్లకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల ఘటన నుండి శ్రీకాంత్‌ను సురక్షితంగా విడిపించారు. కిడ్నాపర్లకు అడిగినంత డబ్బు ఇస్తామని నమ్మించి ట్రాప్ చేశారు. అయితే హరిద్వార్ నుండి ముజఫర్ నగర్ ,మీరట్ ప్రాంతాల్లో నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించారు. అయితే మీరట్‌లోని తన స్నేహితుడి ఇంట్లో శ్రీకాంత్‌గౌడ్‌ను దాచిపెట్టాడు ప్రమోద్. అయితే మంగళవారంనాడు నిందితులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు యూపీ పోలీసుల సహయంతో ప్రమోద్‌ను పట్టుకొన్నారు.ఈ సమయంలో నిందితులపై పోలీసులు కాల్పులకు దిగారు.అయితే ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయని పోలీసులు ప్రకటించారు. తొలినుండి సినీఫక్కిలోనే నిందితులు వ్యవహరించారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు

English summary
A 29-year-old medico A Srikanth Goud, who was kidnapped in Delhi on July 6 by an Ola cab driver, was rescued by the Delhi police on Wednesday. The police would hand over the rescued medico to his uncle Narayana Goud, who is also a doctor in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X