వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్టుబడుల వేట: దుబాయ్‌లో జూపల్లి (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పెట్టుబడులను పెట్టాలనుకునే వారు తమ రాష్ర్టానికి రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు సూచించింది. దుబాయిలో మూడు రోజుల పాటు కొనసాగే వార్షిక పెట్టుబడుల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, పలువురు పారిశ్రామిక వేత్తలు హజరయ్యారు.

ఈ సదస్సు వేదికగా తెలంగాణ రాష్ర్టానికి భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో రాష్ర్టానికి చెందిన ప్రత్యేక బృందం పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో దుబాయ్‌కి వెళ్లింది. దుబాయి పర్యటనలో భాగంగా మంత్రి జూపల్లి యూఏఈ ఆర్థిక శాఖ మంత్రి సుల్తాన్‌ బిన్‌ సయీద్‌ని కలుసుకున్నారు. అలాగే ప్యూర్‌ గోల్డ్‌ చైర్మన్‌ ఫిరోజ్‌ మర్చంట్‌, ఎనాకోర్‌ సొల్యూషన్స్‌ చైర్మన్‌ పద్మనాభన్‌, వర్కీ గ్రూపు డైరెక్టర్‌ సి.ఎన్‌. రాధా కృష్ణ, కిమోహ గ్రూపు ఎండీ వినేష్‌ బిమని తదితరులను కలుకుని చర్చించారు.

కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు దుబాయిలో జరుగుతున్న పెట్టుబడిదారుల ఐదో వార్షిక సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిశ్రమలశాఖ అధికారులు, సీఐఐ ప్రతినిధులు పాల్గొంటున్నారు.

జూపల్లి ఇలా..

జూపల్లి ఇలా..

వార్షిక పెట్టుబడల సదస్సు తొలిరోజు సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు యూఏఈ ఆర్థికమంత్రి సుల్తాన్ బిన్ సయీద్ అల్ మన్సూరీతో సమావేశమై పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వివరించారు.

జూపల్లి ఇలా...

జూపల్లి ఇలా...

బోస్టన్ నార్త్‌ఈస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి రామ్మూర్తి, ప్యూర్ గోల్డ్ గ్రూప్ చైర్మన్ ఫిరోజ్ మర్చంట్, ఎనోకోర్ సొల్యూషన్స్ చైర్మన్ హరి పద్మనాభన్, వార్కి గ్రూప్ డైరెక్టర్ సీఎస్ రాధాకృష్ణ, కిమోహా మేనేజింగ్ డైరెక్టర్ భిమానీలను జూపల్లి కృష్ణారావు కలిశారు.

జూపల్లి ఇలా..

జూపల్లి ఇలా..

మంత్రి జూపల్లి కృష్ణారావు వెంట టీఎస్‌ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ వెంకటనర్సింహారెడ్డి, సీఐఐ తెలంగాణ చైర్‌పర్సన్ దాట్ల వనిత కూడా పర్యటనలో ఉన్నారు.

జూపల్లి ఇలా..

జూపల్లి ఇలా..

వచ్చే మూడేండ్లలో ఐసీటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి కల్పనతోపాటు ఎగుమతులను 10 బిలియన్ డాలర్ల నుంచి 17 బిలియన్లకు పెంచాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతున్నది.

English summary
Minister for Industries, Handlooms & Textile and SugarJupally Krishna Raohas participated Annual Investors meet in Dubai and as part of make in Telangana and on our path to Triumphant Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X