హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాంకుల ద్వారా పన్నులు చెల్లింపు: కేటీఆర్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌ఎంసీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బ్యాంకుల ద్వారా పన్నులు చేల్లించే విధానాన్ని రూపొందించింది. సోమవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దీంతో 7 బ్యాంకుల ద్వారా హైదరాబాద్‌ పరిధిలోని 323 బ్రాంచిల్లో ఉచిత సేవలతో ఆస్తి, ఇతర పన్నులను చెల్లించవచ్చు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా గ్రేటర్ పరిధిలో మరిన్ని మెరుగైన సేవలు పొందేందుకు ఆస్కారం కలుగుతుందని చెప్పారు.

 బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు

బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు

ఇప్పటికే ఈ-ఆఫీస్‌తోపాటు పలు ఇతర సేవలను ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ తాజాగా బ్యాంకుల ద్వారా పన్ను చెల్లింపుకు అవకాశం కల్పించడంలో ప్రజలకు మరింత సౌకర్యం కలిగించిందన్నారు.

బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు

బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు


దీనివల్ల ఎటువంటి సమయం వృధా కాకుండా సమీపంలోని బ్యాంకులో ఎప్పుడైనా పన్ను చెల్లించే ఆస్కారం ఏర్పడింది.

 బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు

బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు


ఆస్తిపన్నుతోపాటు ప్రకటనల పన్ను, ట్రేడ్ లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతి ఫీజులు తదితర సేవలు ఈ బ్యాంకుల్లో అందుబాటులో ఉంటాయన్నారు.

బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు

బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు


ఆస్తిపన్ను చెల్లింపుదారుల వివరాల డేటాను ఆయా బ్యాంకు శాఖలకు అందుబాటులో ఉంచారు.

 బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు

బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు

దీనివల్ల ప్రాపర్టీ ఇండెక్స్ నెంబర్ కానీ, యజమాని పేరు కానీ, ఇంటి నెంబరు కానీ తమ సమీపంలోని బ్యాంకు శాఖలో చెప్పితే సంబంధిత వివరాలన్నీ కంప్యూటర్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు.

బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు

బ్యాంకుల్లో పన్ను చెల్లింపులు

అందులో నమోదైన పన్నును ఎటువంటి అదనపు సర్‌చార్జీ లేకుండా చెల్లించవచ్చు. జీహెచ్‌ఎంసీ పన్నుల కోసం ఆయా బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేస్తారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.

English summary
Telangana Minister KTR at Andhra Bank E-Launch in Secratariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X