వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దారుణం, కేసీఆర్ శత్రువుగా చూస్తున్నారు'(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా మూడోసారి అరెస్టయ్యారు. గత రెండుసార్లు సభా ప్రాంగణంలో అరెస్టు కాగా, గురువారం అసెంబ్లీ గేటు బయటే అదుపులోకి తీసుకున్నారు. సభలోకే కాకుండా సభా ప్రాంగణంలోకి కూడా రానీయరా అడ్డు టీడీపీ ఎమ్మెల్యేలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

దీంతో, తెలంగాణ శాసనసభ వద్ద గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా.. స్పీకర్‌ ఆదేశాలకు సంబంధించిన ఫ్లెక్సీని చూపుతూ టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య చోటుచేసుకొన్న వాగ్వాదం, తోపులాటలో ఎమ్మెల్యే గాంధీ గాయపడ్డారు. సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ భవనంలోకి రాకుండా అడ్డుకున్న సంఘటనలు చరిత్రలో లేవని,ఈ చర్యలు తెరాస సర్కార్‌ నిరంకుశ విధానాలకు పరాకాష్ట అని టీ ఎర్రబెల్లి దయాకర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 టీడీపీ అరెస్ట్

టీడీపీ అరెస్ట్

పోలీసుల వ్యవహారాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి తన కారుకు తాళం వేసి దారి మధ్యలోనే నిలిపేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఎర్రబెల్లి దయాకర రావు, వివేక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

 టీడీపీ అరెస్ట్

టీడీపీ అరెస్ట్

ఎమ్మెల్యే గాంధీని అరెస్టు చేసే క్రమంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆయన పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అందరినీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు తరలించారు.

 టీడీపీ అరెస్ట్

టీడీపీ అరెస్ట్

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కాన్యాయ్‌లో కలిసి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీ, మాధవరం కృష్ణారావు, రాజేందర్‌రెడ్డి నేరుగా అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించారు.

 టీడీపీ అరెస్ట్

టీడీపీ అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ టీడీఎల్‌పీ కార్యాలయంలోకి చేరుకుందామనే సరికి మార్షల్స్‌, పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 టీడీపీ అరెస్ట్

టీడీపీ అరెస్ట్

శాసన సభ బడ్జెట్ సమావేశాల జరుగుతున్న తీరు సభాపతి, మధుసూధన చారి, సభాపతి వ్యవహారాల మంత్రి హరీష్ రావు తీసుకున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 టీడీపీ అరెస్ట్

టీడీపీ అరెస్ట్

సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో ఎన్నడు ఇలాంటి సంఘటనలు జరగలేదని, కేసీఆర్ తమను శత్రువులుగా చూస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.

English summary
Floor Leader of the Telugu Desam Party in the Telangana Legislative Assembly Errabelli Dayakar Rao, Deputy Leader A. Revanth Reddy, K.P. Vivekanand and A. Gandhi were denied entry into the Assembly complex on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X