హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహనికి హజరై, తిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకొన్న టెక్కీ

ఆర్థిక ఇబ్బందులతో 32 ఏళ్ళ టెక్కీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైద్రాబాద్‌లోని ఉప్పల్‌లో చోటుచేసుకొంది. రెండురోజుల క్రితమే అతను చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో 32 ఏళ్ళ టెక్కీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైద్రాబాద్‌లోని ఉప్పల్‌లో చోటుచేసుకొంది. రెండురోజుల క్రితమే అతను చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

మండవ గణేష్ అనే టెక్కీ అతని భార్య అనురాధ, ఏడు మాసాల బాబు బెంగుళూరు నుండి హైద్రాబాద్‌కు ఐదుమాసాల క్రితమే వచ్చారు.

గణేష్ ఉప్పల్‌కు సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే తాను పనిచేసే కంపెనీకి సమీపంలోని ఆదర్శ్‌నగర్‌లో ఆయన ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు.

Telangana: Techie ends life over money woes

ఆయన భార్య అనురాధ కూడ గతంలో బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేది. అయితే ఏడుమాసాల పాపను చూసుకొనేందుకు వీలుగా ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.

అయితే అనురాధ సోదరి వివాహనికి హజరయ్యేందుకుగాను కుటుంబసభ్యులతో కలిసి గణేష్ బెంగుళూరు వెళ్ళాడు. అయితే వారం రోజుల తరువాత ఆయన హైద్రాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే ఏమైందో ఏమోకానీ అతను అదృశ్యమయ్యాడు. ఆయన ఫోన్ స్విఛ్చాఫ్‌లో ఉంది. ఎక్కడికి వెళ్ళాడో కూడ తెలియదు.

అయితే నాలుగురోజుల క్రితం అతను తన ఫ్లాట్‌కు వచ్చాడు. అయితే సోమవారం నుండి అనురాధ తన భర్తకు ఫోన్ చేస్తున్నా రెస్పాన్స్ లేదు. ఈ విషయమై ఫ్లాట్ ఓనర్‌కు ఆమె సమాచారమిచ్చింది. అతను కూడ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే లోపలి నుండి ఎలాంటి సమాధానం రాలేదు.

ఇదే విషయాన్ని ఫ్లాట్ ఓనర్ కూడ అనురాధకు సమాచారమిచ్చాడు. అయితే ఆమె వెంటనే బెంగుళూరు నుండి హైద్రాబాద్‌కు వచ్చింది. అయితే అనురాధ పిలిచినా ఫలితం లేకపోయింది. అయితే స్థానికుల సహయంతో ఆమె తలుపులను పగులగొట్టి చూసింది.అయితే అతను బెడ్‌రూమ్‌లో బెడ్‌షీట్‌తో ఉరి వేసుకొని చనిపోయాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకొన్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

English summary
Troubled by financial problems, a 32-year-old software professional committed suicide in Uppal. His body was discovered by his wife and neighbours when they broke into the bedroom and found him hanging. Police suspect that he had committed suicide two days earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X