హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఓ జాతీయ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్పై ఆగ్రహావేశంతో ఊగిపోయారు. సానియా కోపంతో బెంబేలెత్తిపోయిన రాజ్‌దీప్ చివరకు ఆమె సారీ చెప్పక తప్పలేదు.
వివరాల్లోకి వెళితే... ప్రపంచ టెన్నిస్‌లో తన క్రీడా ప్రస్థానంపై 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' పేరిట ఆమె రాసిన పుస్తకాన్ని ఇటీవలే హైదరాబాద్‌లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తక ప్రమోషన్లో భాగంగా ఆమె పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్యూలు ఇస్తున్నారు.
ఉద్వేగానికి లోనైన సానియా మిర్జా: షారుఖ్ చేతుల మీదగా ఆటోబయోగ్రఫీ
ఇందులో భాగంగా ఓ ఇంటర్యూలో ప్రముఖ టీవి జర్నలిస్ట్ రాజ్‌దీప్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను పలు ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నల్లో జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతారు? మాతృత్వం ఎప్పుడు? అంటూ సానియా వ్యక్తిగత ప్రశ్నలు కూడా ఉండటం విశేషం. ఈ ప్రశ్నలకు బదులు చెప్పేందుకు సానియా కాస్తంత ఇబ్బందిపడ్డారు.
అనంతరం ఈ ప్రశ్నలతో మనసు నొచ్చుకున్న సానియా రాజ్‌దీప్‌పై ఆగ్రహాంతో ఊగిపోయారు. మాతృత్వం ఎప్పుడు? అని అడిగే ముందు తాను సాధించిన టైటిళ్లు కనిపించడం లేదా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె సుదీర్ఘ సమాధానం విన్న రాజ్‌దీప్ తాను వేసిన ప్రశ్న తప్పు అని తెలుసుకున్నారు.
ఆ తర్వాత ఇంటర్యూని కొనసాగిస్తూనే ఏ మాత్రం బేషజాలకు పోకుండా ఆయన సానియాకు సారీ చెప్పారు. ''మీకు వేసిన ప్రశ్నలను నేను ఇప్పటిదాకా ఏ పురుష క్రీడాకారుడికి వేయలేదు. తప్పు చేశాను. మన్నించండి'' అంటూ ఆయన సారీ చెప్పడంతో సానియా ఒకింత శాంతించారు.
అనంతరం తొలిసారిగా ఓ జాతీయ మీడియా ఛానల్ విలేకరి చేత సారీ చెప్పించుకోగలిగాను అంటూ ఆమె సరదా వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదానికి అక్కడితో తెరపడింది.
This tennis star shuts down a reporter's questions — which he admits he wouldn't ask a man https://t.co/zuH42PRutS pic.twitter.com/AQvmy2g2cc
— Salon.com (@Salon) July 14, 2016