వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కానిస్టేబుల్ ఇంట్లో చోరీ: పాము కాటుతో మహిళ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: ఓ కానిస్టేబుల్‌ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని ఐబీకాలనీలో పోలీస్‌క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఓ కానిస్టేబుల్‌ ఇంట్లో 4 తులాల బంగారం, రూ. 15వేల నగదును దొంగలు అపహరించారు. ఈ విషయం తెలుసుకొన్న కానిస్టేబుల్‌ సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కాగా, మహాముత్తారం మండలంలోని కనుకునూర్‌ గ్రామానికి చెందిన మారవేని సుమలత (30) పాము కాటుకు గురై శనివారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృ తిచెందింది. సుమలత శనివారం చీపురు తయారీ పుల్లల సేకరణకు ఆడవికి వెళ్లగా పాముకాటుకు గురైంది. మహదేవపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. అడవి నుంచి ఆసుపత్రికి తరలించడంలో జాప్యంంతోనే మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు మహాముత్తారం ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు.

దొంగ నోట్ల కలకలం

Theft in Constable house in Karimanagar district

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దొంగనోట్ల కలకలం సంచలనం సృష్టిస్తోంది. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొన్ని నెలల క్రితం ఓ కేసు లో కరీంనగర్‌ జైలుకు వెళ్లాడు. అక్కడ ఆయనకు దొంగనోట్ల ముఠాకు చెందిన వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. దీంతో ఏదైనా పార్టీ ఉంటే చూడు నీకు కొంత వాటా ఇస్తా నంటూ ఆ వ్యక్తి నమ్మించాడు. జైలు నుంచి స్వగ్రామమైన కోరపల్లి గ్రామానికి చేరుకున్న సదరు వ్యక్తి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని పరిచయం చేసుకొన్నాడు. అతని ఆర్థి క పరిస్థిని ముందుగానే తెలుసుకొని రూ.లక్ష 50 వేలు ఇస్తే 5 లక్షల రూపాయల నగదును ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో ఆ వ్యక్తి సరేనని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ మేరకు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

జైలులో పరిచయమైన వ్యక్తికి ఫోన్‌ చేయ డంతో పార్టీని కాజీపేటకు తీసుకు రమ్మని సూచించాడు. అక్కడ డీల్‌ ఒకే కావడంతో, మరోసారి ఆదిలాబాద్‌లో ముఠా సభ్యుడిని కలిసినట్లు సమాచారం. ఎట్టకేలకు 5 లక్షల నకిలీనోట్ల కట్టలను ఒక సంచిలో వేసి ఆ వ్యక్తికి ఇచ్చారు. అక్కడే డబ్బును చూస్తే తన వెంట వచ్చిన వ్యక్తి కమిషన్‌ అడుగుతాడేమోనని భయపడి నేరుగా ఇంటికి చేరుకొన్నాడు. అక్కడ డబ్బును తీసి చూడగా చిన్న పిల్లలు ఆడుకునే వెయ్యి రూపాయల నకిలీనోట్లు కనిపించాయి. దీంతో లబోదిబోమని బాధితుడి మొత్తుకొన్నాడు. ఈ విషయం బయటికి తెలిస్తే పోలీసులు అరెస్టు చేస్తారని భయపడిన బాధిత వ్యక్తి మధ్యవర్తిని ప్రశ్నించగా తనకేమి సంబంధం లేదంటూ తప్పించుకున్నాడు.

దీంతో బాధితుడు ఆ నకిలీ డబ్బును తన ఇంటి సమీపంలోని గడ్డివాము లో దాచి పెట్టాడు. ఈ సంఘటన జరిగి 15 నెలలు గడుస్తుండగా గ్రామంలోని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. కాగా మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ముఠా సభ్యుడిపై అనేక కేసులు ఉన్నట్లు తెలిసింది.

English summary
A constable house has been robbed at Godavarikhani in Karimanagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X