వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు, 10వేల సిసి కెమెరాలు: నాయిని

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో భద్రతను పటిష్టం చేశామని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం నాడు తెలిపారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

హోంమంత్రితో పాటు మంత్రి తమ్మల నాగేశ్వర రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయిని మాట్లాడుతూ.. జంటనగరాల్లో భద్రతను పటిష్టం చేశామన్నారు. ప్రతిపక్షాలు శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రతి నియోజకవర్గంలో పేదవారికి ఇళ్లు కట్టివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఇంటింటికి మంచినీళ్లు అందించేందుకు జలహారం ప్రాజెక్టును చేపట్టామని నాయిని చెప్పారు. శాంతిభద్రతలను కాపాడటంలో రాజీపడేది లేదన్నారు. నగరంలో కొత్తగా పది వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

 There is no tolerance on law and order: Nayini

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ... శాంతిభద్రతలు బాగుంటే అభివృద్ధి దానంతట అదే జరుగుతుందన్నారు.

పోలీసు శాఖను ఆధునికీకరించామని, శాంతిభద్రతలు బాగుంటే అభివృద్ధి దానంతట అదే జరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్‌కు కొత్త భవనం కావాలని అడిగిన వెంటనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేసీఆర్ మంజూరు చేశారన్నారు.

సమీక్ష సమావేశాల్లో మంత్రులు

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిలు నేడు సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే మార్చి నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా అంశంపై ట్రాన్స్‌కో, జెన్కో అధికారులతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై అధికారులతో మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష చేపపట్టారు.

English summary
Telangana Home Minister Nayini Narsimha Reddy said that there is no tolerance on law and order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X