వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియురాలి కోసం ‘దొంగ’వేషాలు: చివరకు ఆమే పోలీసులకు పట్టించింది!

దొరికినట్లే దొరికి తప్పించుకుంటున్న ఓ యువ దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అంతర్ జిల్లాల దొంగ అత్తినేని చంద్రమోహన్ అలియాస్ చందును గురువారం జగిత్యాల జిల్లా రాయికల్ పోలీసులు పట్టుకున్నారు.

|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: దొరికినట్లే దొరికి తప్పించుకుంటున్న ఓ యువ దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అంతర్ జిల్లాల దొంగ అత్తినేని చంద్రమోహన్ అలియాస్ చందును గురువారం జగిత్యాల జిల్లా రాయికల్ పోలీసులు పట్టుకున్నారు.
రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన చందు తన ప్రియురాలిని కలవడం కోసం గ్రామ శివారులోకి వచ్చి పట్టుబడ్డారు. అతడ్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు.

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా, రాయికల్‌ మండలం అయోధ్య గ్రామానికి చెందిన అత్తినేని చంద్రమోహన్‌ అలియాస్‌ చందు పదోతరగతి వరకు చదువుకున్నాడు. చందు తల్లిని అతని చిన్నతనంలో తండ్రి సత్తయ్య వదిలేసి మరో మహిళను వివాహం చేసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి చందు, అతని అక్కను తల్లి కష్టపడి పనిచేస్తూ పెంచింది. అక్కకు పెళ్లి చేసింది.

చందుకు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో ఖాళీగా తిరుగుతూ డబ్బులు లేకపోవడంతో దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. 2014లో రాయికల్‌ మండలం అల్లిపూర్‌ గ్రామంలో దొంగతనం చేసి అరెస్టయి తొలిసారి 17వ యేటనే జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా తన పద్ధతి మార్చుకోకుండా దొంగతనాలను కొనసాగించాడు.

జగిత్యాలలో దొంగతనాలకు పాల్పడి అరెస్టైన చందు.. జగిత్యాల జైల్లోంచి సెప్టెంబర్‌ 2016లో విడుదలయ్యాడు. ఫిబ్రవరిలో మెట్‌పల్లి, కోరుట్లలో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసి ఫిబ్రవరి 18న రాత్రి కరీంనగర్‌లోని బోయవాడకు చెందిన కన్నం లక్ష్మయ్య ఇంటి తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశాడు. సీసీ కెమేరాల ఫుటేజీని పరిశీలించి దొంగతనానికి పాల్పడిన చందును ఫిబ్రవరి 28న అరెస్టు చేసి జిల్లా కారాగారానికి రిమాండ్‌కు తరలించారు.

thief chandu arrested in jagtial

కాగా, చంద్రమోహన్‌ అలియాస్‌ చందుకు పోలీసుల కళ్లుగప్పి పారిపోవడం వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఒకటో ఠాణా పోలీసులు కోర్టు అనుమతితో మూడురోజుల విచారణ నిమిత్తం చందును మార్చి 4న జైలు నుంచి ఠాణాకు తరలించగా కాలకృత్యాల నెపంతో పోలీస్‌స్టేషన్‌ నుంచి మార్చి 5న తప్పించుకు పారిపోయాడు.

నిఘావేసిన పోలీసులు మార్చి 22న చందును అరెస్టు చేసి మే 4న ఒకటో ఠాణా సీఐ తుల శ్రీనివాస్‌రావు పీడీయాక్ట్‌ను అమలు చేసి వరంగల్‌లోని కేంద్రకారాగారానికి తరలించారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో చందు చేసిన చోరీ కేసుకు సంబంధించి విచారణ నాంపల్లి కోర్టులో ఉండటంతో సెంట్రల్‌ జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా జనగామ జిల్లా యశ్వంతపూర్‌ వద్ద ఎస్కార్టు పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు చందు. గతంలో కూడా జగిత్యాల, రాయికల్‌ పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి.

ప్రియురాలి సాయంతో పథకం ప్రకారం పట్టుకున్న పోలీసులు

యశ్వంతపూర్‌ వద్ద తప్పించుకున్న చందు జనగామలో ద్విచక్రవాహనాన్ని చోరీ చేసి హైదరాబాద్‌ చేరుకొని కొన్ని రోజులు మకాం చేశాడు. అనంతరం జగిత్యాలకు వచ్చి పొలాలు, చెరువు గట్లు, అటవీప్రాంతాల్లో ఉంటూ రెక్కీ నిర్వహించి పలు చోరీలకు పాల్పడ్డాడు. చందును ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నించిన ఒకటో ఠాణా పోలీసులు చందు సెల్‌ఫోన్‌ నంబర్‌ సంపాదించారు.. అప్పటి నుంచి చందు కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉన్నారు.

వారం రోజుల క్రితం చందు జగిత్యాలకు వచ్చినట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా జనగామలో చోరీ చేసిన ద్విచక్రవాహనాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఒకటో ఠాణా పోలీసులు మూడు రోజుల కిందట పక్కాగా పథకం రచించారు.

కాగా, చందుకు స్వగ్రామంలోనే ఓ ప్రియురాలు ఉంది. ఆమెకు దొంగతనం చేసిన డబ్బుతో ఖరీదైన గిఫ్టులు కొనిచ్చేవాడు చందు. ఈ క్రమంలో తాను ప్రియురాలితో దిగిన ఫొటోలు వాట్సప్‌లో పెట్టి అందరికీ షేర్ చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన చందు ప్రియురాలు అతడ్ని ఎలాగోలా పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకుంది. పోలీసులకు కూడా ఈ విషయం తెలియడంతో గ్రామానికి వచ్చిన వెంటనే చందును అదుపులోకి తీసుకోవాలని పథకం వేశారు. గ్రామస్తులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు.

హైదరాబాద్ నుంచి వచ్చిన చందు నేరుగా తన స్వగ్రామానికి వెళ్లాడు. స్వగ్రామంలో ఉన్న తన ప్రేయసి వద్దకు వస్తున్నాడనే సమాచారంతో కరీంనగర్‌ నుంచి పయనమయ్యారు పోలీసులు. గ్రామానికి వచ్చిన చందును గ్రామస్థులు పట్టుకుని నిర్బంధించగా ఒకటో పోలీస్ స్టేషన్, రాయికల్‌ పోలీసులు వెళ్లి పట్టుకున్నారు.

టెక్నాలజీని వాడేశాడు

చందు పెద్దగా చదువుకోకపోయినా టెక్నాలజీ వినియోగండంలో మాత్రం ఆరితేరాడు. వాట్సప్, ఐఎంఓ, ఫేస్‌బుక్ ద్వారా ఫోన్ కాల్స్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరిగేవాడు. కాగా, తాజాగా పోలీసులు కొత్తగా అందిపుచ్చుకున్న ఓ సాప్ట్‌వేర్‌తో చందు వాడుతున్న ఫేస్‌బుక్, ఐఎంఓ, వాట్పప్ కాల్స్‌పై నిఘా పెట్టడంలో చందు ఉన్న ప్రదేశాలను గుర్తించి పట్టేశారు. ఇది ఇలా ఉండగా, గ్రామంలోకి స్త్రీవేషాధారణ, హనుమాన్ దీక్ష వేషాధారణతో వచ్చి ప్రియురాలితో గడిపేవాడని గ్రామస్తులు తెలిపారు.

English summary
Inter district Thief chandu arrested in jagtial on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X