ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్మల్ కోర్టును పేల్చేస్తాం: హైకోర్టుకు బెదిరింపు లేఖ

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: జిల్లాలోని నిర్మల్ పట్టణంలో ఉన్న కోర్టు భవనాన్ని పేల్చివేస్తామంటూ హైకోర్టుకు మంగళవారం ఒక బెదిరింపు లేఖ అందింది. దుండగులు ఈ మేరకు హైకోర్టుకు ఫ్యాక్స్ చేశారు. ఈ నేపథ్యంలో డిజిపి ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు.

బెదిరింపు లేఖ సమాచారంతో నిర్మల్ కోర్టులో తనిఖీలు పోలీసులు చేపట్టారు. బాంబు లేకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. లేఖ ఎక్కడ నుంచి వచ్చింది అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈరోజు లేదా వినాయక చవితి రోజైనా కోర్టును పేల్చేస్తామని లేఖలో దుండగులు పేర్కొన్నట్లు తెలిసింది.

Threatening letter to Nirmal Court

ఇది ఇలా ఉండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. మంగళవారం మద్యాహ్నం వరుసగా రెండు బాంబులు పేలాయి. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

పోలీసు జాగిలాలతో పరిశీలించారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.

40 తులాల బంగారు అభరణాల చోరీ

హైదరాబాద్ నగరంలో భారీ చోరీ సంఘటన చోటుచేసుకుంది. టోలీచౌక్‌లోని అల్‌హసంత్ కాలనీలోని ఓ ఇంట్లోకి గుర్తు తెలియని దుండుగులు చొరబడి 40 తులాల బంగారు అభరణాలను అపహరించుకు పోయారు.

English summary
A Threatening letter to Nirmal Court received on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X