హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెల్లారిన బతుకులు: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి, 10లక్షల పరిహారం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణంలోవున్న కమాన్ (ఆర్చ్ గేట్) కుప్పకూలింది. ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల ఫిలింనగర్, చిలకలగూడలో కూలిన నిర్మాణాల ఘటన మరువక ముందే తాజాగా మంగళవారం కూకట్‌పల్లిలో జరిగిన మరో దుర్ఘటన స్థానికులను కలచివేసింది.

ప్రమాద మృతుల్లో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ధర్మారావు(38), గొల్లలపాడు గ్రామవాసి నాగభూషణం(48)తోపాటు ఒడిశాకు చెందిన జనార్థన్‌(48) ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా మూసాపేట్‌ ప్రగతినగర్‌లో నివాసముంటున్నారు.

మృతుడు

మృతుడు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణంలోవున్న కమాన్ (ఆర్చ్ గేట్) కుప్పకూలింది.

మృతుడు

మృతుడు

ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుడు

మృతుడు

ఇటీవల ఫిలింనగర్, చిలకలగూడలో కూలిన నిర్మాణాల ఘటన మరువక ముందే తాజాగా మంగళవారం కూకట్‌పల్లిలో జరిగిన మరో దుర్ఘటన స్థానికులను కలచివేసింది.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

ప్రమాద మృతుల్లో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ధర్మారావు(38), గొల్లలపాడు గ్రామవాసి నాగభూషణం(48)తోపాటు ఒడిశాకు చెందిన జనార్థన్‌(48) ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

‘మెడోల్యాండ్‌' పేరుతో వసంతనగర్‌లో నిర్మిస్తున్న భారీ భవన సముదాయానికి సంబంధించి బిల్డర్లు 2014లో జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన ‘కమాను' ప్లాన్‌ను అందులో చూపించలేదు. అందువల్ల కమాను అక్రమ నిర్మాణం అవుతుందని పట్టణ ప్రణాళిక అధికారులు అంటున్నారు.

ఆందోళన

ఆందోళన

మృతుల కుటుంబ సభ్యులు సంఘటన ప్రాంతంలో న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. కుటుంబ సభ్యులు రాకముందే అపార్ట్‌మెంట్ యజమానులు మృతదేహాన్ని అక్కడినుంచి తరలించడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాణ్యత లోపంతో పనులు చేపట్టిన నిర్వాహకులపై చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితుల ఆందోళన

బాధితుల ఆందోళన

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయించాలని కోరారు.

బాధితుడు

బాధితుడు

సమాచారం తెలిసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నవీన్‌చంద్, మాదాపూర్ డిసిపి కార్తికేయ, కూకట్‌పల్లి ఏసిపి భుజంగరావు, సిఐ కుషాల్కర్, డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, ఎమ్మెల్యే కృష్ణారావు, జిహెచ్‌ఎమ్‌సి జోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి, కూకట్‌పల్లి-14ఎ, 14బి కమిషనర్లు నరేందర్‌గౌడ్, రవీందర్‌కుమార్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

నాలుగున్నర ఎకరాల్లో 14 బ్లాకులు, స్టిల్ట్‌, సెల్లార్‌, ఐదు అంతస్తులతో కూడిన 540 ఫ్లాట్ల డిజైన్‌కు మాత్రమే అనుమతి ఉందని, ప్రహరీ కూడా ప్లాన్‌లో చూపించలేదని చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. 15 అడుగుల ఎత్తులో 25 అడుగుల వెడల్పుతో కమాను నిర్మాణం చేపట్టారని, ఇరువైపులా నాలుగు పిల్లర్లు వేసినా వాటిపై వేసిన రెండు బీమ్‌ల నిర్మాణం ప్రమాదానికి కారణమైందని చెప్పారు.

బాధిత కుటుంబాల రోదన

బాధిత కుటుంబాల రోదన

భారీ బీమ్‌లను నిర్మించాల్సి వచ్చినప్పుడు వాటి బరువుకు తగ్గట్లు బలమైన సెంట్రింగ్‌ను ఏర్పాటు చేయాలని, అయితే గుత్తేదారు పాత కర్రలను ఉపయోగించడంతో అవి విరిగిపోయి పైనున్న ముగ్గురు కార్మికులు శిథిలాల కింద పడి అక్కడిక్కడే చనిపోయారని తెలిపారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

ఈ నిర్మాణంపై జూన్‌ 6న సీబీ సిఐడీ సొసైటీ వాసులు ‘మెడోల్యాండ్‌'పై పిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున ఇస్తామని, అంత్యక్రియలకు రూ.50వేలు, క్షతగాత్రుల చికిత్సకయ్యే ఖర్చులు భరిస్తామని భవన యాజమాన్యం తెలిపింది.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

మరోవైపు పోలీసులు బిల్డర్లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని బల్దియా కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్ది అధికారులకు ఆదేశాలిచ్చారు.

English summary
In yet another tragic incident, three workers died and four others injured when an under-construction arch collapsed at Vasanth Nagar, in the CID Colony, Kukatpally, near the Jawaharlal Nehru Technological University (JNTU).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X