వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టేబుల్ ఫ్యాన్‌లో 3 కిలోల బంగారం: కోడలి హత్యకు మామ యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 3 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా అధికారులు ఈ అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద ఈ బంగారం లభించింది.

తనిఖీ చేస్తుండగా కస్టమ్స్ అధికారులకు టేబుల్ ఫన్ చాలా బరువు ఉన్నట్లు తోచింది. దాంతో సందేహంచి, నిశితంగా పరిశీలించారు. ఫ్యాన్ కింది భాగంలో భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నట్లు వారు గుర్తించారు. ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆడపిల్లకు జన్మనిచ్చిందని కోడలును చంపేందుకు అత్తామామలు ప్రయత్నించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా చిట్యాల మండలం రాఘవాపూర్‌లో చోటుచేసుకుంది. అత్తామామల చర్యను గ్రామస్తులు నిలువరించి వారిని నిర్బంధించారు.

Three KGs gold seized at Shamshabad airport

కీసరలో ఇంట్లో చోరీ

రంగారెడ్డి జిల్లా కీసరలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంట్లో ఉన్న రూ. లక్ష నగదుతో పాటు ఏడు తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

యువకుడి దారుణ హత్య

కరీంనగర్ జిల్లా మల్యాల మండలం నూకపల్లి దగ్గర ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. కొందరు దుండగులు యువకుడిని కత్తితో పొడిచి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

English summary
Three KGs gold seized from a passenger, travelled from Dubai to Hyderabad in shamashabad international airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X