సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిద్దిపేట నర్సరీ మొక్క కెసిఆర్ బిజీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తాను సిద్దిపేట నర్సరీలో మొలిచిన మొక్కనని సిఎం కెసిఆర్ అన్నారు. తనను ఇప్పుడు తెలంగాణకే నీడనిచ్చే స్థాయికి సిద్దిపేట ప్రజలు తీసుకు వచ్చారన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఏ ఊరిలో యువకులు ఆ ఊరికి కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు.

ఇది ఏ ఒక్కరో చేసే పని కాదన్నారు. ఇది కొత్త కార్యక్రమం కూడా కాదన్న సీఎం పదిహేనేండ్ల క్రితమే సిద్దిపేటలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించామన్నారు. పదిహేనేళ్ల క్రితం సిద్దిపేటలో 10 నిమిషాల్లో 10 వేల మొక్కలు నాటామన్నారు.

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నియోజకవర్గానికి రూ.5 కోట్లు స్పెషల్ గ్రాంట్‌గా అందిస్తామన్నారు. సిద్దిపేటను జిల్లాగా చేస్తానని చెప్పారు. హైదరాబాదు సమీపంలోని శామిర్ పేటలో అ్ని హంగులతో విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాళేళ్వర స్వామికి బంగారు కిరీటం చేస్తామన్నారు.

హరిత హారం

హరిత హారం

కేసీఆర్ శనివారం రెండవ రోజు తెలంగాణకు హరితహారం పర్యటన కొనసాగింది. రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించిన కెసిఆర్.. వివిధ ప్రాంతాల్లో 13 మొక్కలు నాటారు.

హరిత హారం

హరిత హారం

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో క్రీడాకారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దిపేట, షాద్‌నగర్ మండల పరిషత్ కార్యాలయాల్లో హరితహారం కోసం మొక్కలు నాటారు.

 హరిత హారం

హరిత హారం

సిద్దిపేట - హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటుతున్న విద్యార్థులతో మమేకం అయ్యారు. హుస్నాబాద్ ఎల్లమ్మ గుడిలో పూజారులతో కలిసి, సిద్దిపేట మండలం, బద్దిపడగ మసీదులో ఇమామ్‌తో కలిసి మొక్కలు నాటారు.

 హరిత హారం

హరిత హారం

సిద్దిపేట మార్కెట్‌లో రైతులతో కలిసి, రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులతో కలిసి హరితహారం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా శనిగరం ప్రాంతంలో రిజర్వు ఫారెస్టులో వీఎస్‌ఎస్ సభ్యులతో కలిసి, హుస్నాబాద్ అంగడిలో చిన్న వ్యాపారులతో కలిసి మొక్కలు నాటారు.

 హరిత హారం

హరిత హారం

కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ఐకేపీ కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. అన్ని వర్గాలను కలుపుకొంటూ ముఖ్యమంత్రి హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

హరిత హారం

హరిత హారం

58 ఏండ్లు మనం దారితప్పామని, అంధ్రోళ్ల చేతిలో ఉన్న మనం వాళ్లు చెప్పింది విన్నామన్నారు. ఇప్పుడు సిద్దిపేట మట్టిబిడ్డనే రాష్ట్ర తొలి సీఎం అయ్యాడని చెప్పారు.

 హరిత హారం

హరిత హారం

ఎవరినీ అడుక్కుతినే పరిస్థితిలో లేమని పేర్కొన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంకావాలని 40కోట్ల మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ తీసుకున్నాం.

 హరిత హారం

హరిత హారం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి శనివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో మొక్కలు నాటారు.

 హరిత హారం

హరిత హారం

హరితహారం కార్యక్రమాన్ని సక్సెస్ చేసే నియోజక వర్గానికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.5 కోట్ల గ్రాంట్ అందిస్తుందని సీఎం ప్రకటించారు. గ్రాంట్ సాధించుకోవడానికి ప్రజా ప్రతినిధులు కష్టపడాలని అన్నారు.

 హరిత హారం

హరిత హారం

తాను సిద్దిపేట నర్సరీలో మొలిచిన మొక్కనని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇయాల ఇక్కడి నుంచి చెట్టోలే పెరిగి తెలంగాణకే నీడనిచ్చే స్థాయికొచ్చానన్నారు.

 హరిత హారం

హరిత హారం

కేసీఆర్‌కు ముందు మాట్లాడిన మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన విజ్ఞప్తులపై సీఎం స్పందిస్తూ హరీశ్.. బాగా హుషారున్నాడన్నారు. మరిచిపోగలనని ముందే జాగ్రత్త చెబుతున్నాడని, మూడు పనులు చేసుకుంటే సిద్దిపేట బంగారు తునక అవుతుందన్నారు. రానున్న మూడున్నరేళ్లలో గ్రామ గ్రామానికి గోదావరి నీళ్లు తెచ్చి ప్రజల పాదాలు కడుగుతానన్నారు.

 హరిత హారం

హరిత హారం

సిద్దిపేట వాళ్లు చాలా అదృష్టవంతులు. ఇక్కడ కట్టే రిజర్వాయర్‌తో నియోజకవర్గంలోని ప్రతి ఊరికి, పల్లెకు సాగునీళ్లొస్తాయి.

 హరిత హారం

హరిత హారం

సిద్దిపేట సమీపంలో చంద్లాపూర్, విఠలాపూర్‌లతోపాటు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట, దుబ్బాక నియోజకవర్గం, వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, చేర్యాల వాళ్లు కరువుతో అల్లాడుతున్నారు. అక్కడికీ సాగునీళ్లందుతాయి అని హామీ ఇచ్చారు.

 హరిత హారం

హరిత హారం

కొద్ది రోజుల్లోనే కరీంగనర్ జిల్లాలోని కాళేశ్వరం ఆలయం వద్ద కాళేశ్వరం పథకానికి తానే స్వయంగా శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ఇక్కడి నుంచి మీరందరు రావాలే. అవసరమైతే నాలుగైదు వందల బస్సుల్లో అక్కడికి పోదాం. గోదారి ఒడ్డున ఉన్న కాళేశ్వరస్వామికి దండం పెట్టి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకుందాం.

 హరిత హారం

హరిత హారం

తెలంగాణ వస్తే బంగారు కిరీటం పెడతామని తన భార్య కాళేశ్వరస్వామికి మొక్కుకుందని, శంకుస్థాపన రోజే స్వామికి మా ఇంటి డబ్బులతో బంగారు కిరీటం పెట్టి, దండం పెట్టి మంచినీళ్లివ్వమని మొక్కుదామని కేసీఆర్ అన్నారు.

English summary
Time to turn Telangana into a 'golden' state, says KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X