హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'కేసీఆర్ తలచుకుంటేనే ఎవరికైనా పదవులు', హైకోర్టుపై మరో ఉద్యమం చేయాలన్న కోదండ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తలచుకుంటేనే తెలంగాణలో ఎవరికైనా పదవులు వస్తాయని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ నేత సున్నం రాజయ్య అన్నారు. అంతేతప్ప టీఆర్ఎస్‌లో డిమాండ్లు చేస్తే పదవులు రావని వ్యాఖ్యానించారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా తాను మున్సిపల్, పంచాయితీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. త్వరలోనే కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఆరోపణలు రావడంతో డిప్యూటీ సీఎం నుంచి తొలగించిన తర్వాత రాజయ్య కొంతకాలం మౌనంగా ఉంటున్న సంగతి తెలిసందే.

TJAC Chairman Kodandaram on high court

ప్రత్యేక హైకోర్టు కోసం మరో ఉద్యమం

తెలంగాణ వాదులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు విభజన ఇంకా పూర్తి కాలేదని, ప్రత్యేక హైకోర్టు కోసం మరో ఉద్యమం చేయాల్సిందేనని ఆయన శనివారం పేర్కొన్నారు.

ప్రత్యేక హైకోర్టు ఆవశ్యకతపై హైదరాబాద్‌లోని సుందరయ్య్ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ ప్రత్యేక హైకోర్టు డిమాండ్ ఒక్క న్యాయవాదులకే పరిమితం కారాదాని చెప్పిన ఆయన, ఇందు కోసం తెలంగాణ సమాజం ఉద్యమబాట పట్టాలని అన్నారు.

రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రభుత్వ రంగ సంస్ధల విభజనకు సంబంధించి ఎలాంటి కమిటీ ప్రస్తావన లేదని ఆయన అన్నారు. షీలా బేడీ కమిటీ కూడా ఇరు రాష్ట్రాల మద్య కేవలం ఆస్తుల పంపిణీకి పరిమితమని ఆయన పేర్కొన్నారు.

English summary
TJAC Chairman Kodandaram on high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X