వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు చెక్: అమిత్ షా, రాహుల్ రాకలో ఆంతర్యం అదే..

తెలంగాణలో అధికార బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలపై రాష్ట్రంలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దృష్టి సారించింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణలో అధికార బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలపై రాష్ట్రంలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దృష్టి సారించింది. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు మాత్రమే ఉండటంతో అప్పుడే రాష్ట్ర రాజకీయం క్రమంగా వేడెక్కుతున్నది. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వ్యూహాలు, ప్రజలపై చూపే ప్రభావం, ఇతర అంశాలపై ఆరా తీస్తున్నది.
మరోవైపు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను హెచ్చరిస్తోంది. పది రోజుల వ్యవధిలోనే తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాగానే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సహజంగానే రాష్ట్రంలో బలోపేతం కావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నది.

అధికారం అండతో విపక్షాలను కకావికలు చేయడంలో ఒకింత విజయం సాధించింది. అదే సమయంలో ప్రజాశ్రేణుల్లో ఉద్యమ పార్టీ తమకు మేలు చేకూరుస్తుందన్న ఆశలు అడుగంటుతున్న తరుణంలో ఇటీవలి కాలంలో సంక్షేమ పథకాలతో వారికి తాయిలాలందించి సానుకూల ప్రజాతీర్పు పొందాలని అధికార టీఆర్ఎస్ తలపోస్తున్నది. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధినేతలు రాష్ట్రంలో పర్యటిస్తుండటం అధికార టీఆర్ఎస్ పార్టీలో కలవరం కనిపిస్తోంది. అమిత్ షా పర్యటన లక్ష్యాలు తెలియగానే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవితో ప్రశ్నలు సంధించడంతోనే టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

ఒకటో తేదీన సంగారెడ్డిలో రాహుల్ సభ

ఒకటో తేదీన సంగారెడ్డిలో రాహుల్ సభ

అమిత్‌ షా పర్యటన సోమవారం నుంచి 25వ తేదీ వరకు నాలుగు రోజులపాటు సాగనున్నది. రాష్ట్రంలో అమిత్‌ షా పర్యటన ఇన్ని రోజులు జరగనుండడం ఇదే తొలిసారి. గతంలో రెండుసార్లు ఆయన రాష్ట్రానికి వచ్చినా ఒకటి, రెండు రోజుల్లోనే ముగించుకుని వెళ్లిపోయారు. మరోవైపు చాలా రోజుల తర్వాత రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌గాంధీ వచ్చేనెల ఒకటో తేదీన జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. తమ పార్టీనే లక్ష్యంగా చేసుకుని బీజేపీ, కాంగ్రెస్‌లు అగ్రనేతల పర్యటిస్తున్నారని టీఆర్ఎస్ భావిస్తోంది.

పార్టీలోకి ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల వలస

పార్టీలోకి ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల వలస

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాజకీయంగా బలోపేతం కావడానికి యత్నించింది. మెదక్‌, వరంగల్‌ లోక్‌సభ స్థానాలకు, నారాయణఖేడ్‌, పాలేరు శాసనసభ ఉపఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు గెలిచింది. హైదరాబాద్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నల్గొండ, మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరుకు బీజేపీ, కాంగ్రెస్‌.. కళ్లెం వేశాయి. తర్వాత పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా పటిష్ఠపరిచేందుకు టీఆర్ఎస్ అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. వారంతా తనకు బలమని గట్టిగా విశ్వసిస్తున్న టీఆర్ఎస్ అసలు సిసలు బలం సగటు పౌరులన్న సంగతి విస్మరిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రాహుల్, అమిత్ షా పర్యటనల లక్ష్యం టీఆర్ఎస్?

రాహుల్, అమిత్ షా పర్యటనల లక్ష్యం టీఆర్ఎస్?

టీఆర్ఎస్ ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదులో 75 లక్షల మందిని చేర్చుకొంది. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ఠపరిచేందుకు నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై వరుసగా సర్వేలు నిర్వహిస్తోంది. ఈ తరుణంలో అమిత్‌షా, రాహుల్‌ల పర్యటనలు రాజకీయంగా తమను ఎదుర్కోవడానికేనని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు

అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు

అమిత్‌ షా, రాహుల్‌ల పర్యటనల గురించి సూక్ష్మస్థాయిలో విశ్లేషించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ సర్వే చేస్తోంది. ఈ సందర్భంగా అమిత్‌ షా, రాహుల్‌ పర్యటించే ప్రాంతాల్లో జనం నాడిని తెలుసుకోవాలని సర్వే సంస్థలకు అధికార పార్టీ అధిష్ఠానం సూచించినట్లు తెలిసింది. పార్టీ శ్రేణులు సైతం పరిస్థితులను సూక్ష్మంగా గమనించాలని, జనాభిప్రాయాన్ని తెలుసుకోవాలని నిర్దేశించినట్లు సమాచారం. రాజకీయంగా టీఆర్ఎస్‌నే లక్ష్యంగా చేసుకున్నందున పార్టీలోని అసంతృప్తులను విపక్షాలు తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందనే భావనతో వీటిపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.

హైదరాబాద్ జిల్లాలో బీజేపీ ఇలా

హైదరాబాద్ జిల్లాలో బీజేపీ ఇలా

పాత నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో అమిత్‌ షా, సంగారెడ్డి జిల్లాలో రాహుల్‌ పర్యటన జరగనున్నది. బీజేపీ పాత నల్లగొండ, హైదరాబాద్‌ జిల్లాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. నల్లగొండలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్‌కు పోటీ ఉంది. అయితే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో జిల్లాలో పట్టు సాధించామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నా ఎంత మేరకు అవన్నీ ఓట్లుగా అధికార పార్టీకి అనుకూలంగా మారతాయన్నదీ అనుమానమేనంటున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనే బీజేపీ, మజ్లిస్‌లకు ఎంపీలు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్‌ స్థానాలు గెలుచుకోవడంతో టీఆర్ఎస్ బలం పెరిగిందనే అంచనాలు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్‌ నియోజకవర్గం 1.20 లక్షల సభ్యత్వాల నమోదుతో టీఆర్ఎస్ వరుసగా రెండోసారి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. శేరిలింగంపల్లి, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, కంటోన్మెంట్‌, ముషీరాబాద్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల్లోనూ సభ్యత్వ నమోదు ఉత్సాహంగా సాగింది. మరోవైపు సంగారెడ్డిలో టీఆర్ఎస్ బలంగానే ఉన్నదని, ఈ జిల్లాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు పర్యటించినా తమకేమీ ఢోకా ఉండదని తెరాస నేతలు చెబుతున్నారు.

English summary
TRS leader ship as concerned BJP President Amit Shah and Congress vice president Rahul Gandhi tours in Telangana. BJP President Amit Shah tour has starts from today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X