వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రేవంత్‌కు శిక్ష తప్పదు', 'టీఆర్ఎస్ తప్పుడు కేసులకు భయపడం'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వజూపి అడ్డంగా దొరికిపోయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదని టీఅర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఓటుకు నోటు కేసులో హైకోర్టు నిర్దోషి అనే చెప్పకముందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. కోర్టు ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ మాత్రమే ఇచ్చిందన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని అన్నారు.

TRS MLA Jeevan Reddy Warns Revanth Reddy on bail

టీఆర్ఎస్ తప్పుడు కేసులకు భయపడేది లేదు

టీఆర్ఎస్ తప్పుడు కేసులకు భయపడేది లేదని ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుందని, పోరాటంలో రాజీ లేదని తెలిపారు. టీడీపీ కార్యకర్తల అండతో, మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రభుత్వ అక్రమాలపై పోరాడతామని చెప్పారు.

కుట్రతోనే రేవంత్ రెడ్డిన ఓటుకు నోటు కేసులో ఇరికించారని చెప్పిన ఆయన రేవంత్‌కు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

English summary
TRS MLA Jeevan Reddy Warns Revanth Reddy on bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X