వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేల విడిచి సాము: హరీష్ రావు భయంతోనే కెటిఆర్ వెనక్కి...?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పచ్చకళ్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించిందంట. అలాగే అధికారంలో ఉన్నవారికి తమ ను ప్రశ్నించిన వారంతా పవర్ కోసం, పదవుల కోసం ఆరాట పడుతున్నారన్న భావన కలుగుతున్నది. అందునా దాదాపు ఐదేళ్ల పాటు రాష్ట్ర సాధనకు జరిగిన మలిదశ ఉద్యమంలో భుజంభుజం కలిపి పోరాడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి (టీఎస్ జేఏసీ) చైర్మన్ ఎం కోదండరాంను ఉద్దేశించి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

వ్యక్తిగత లబ్ధి పొందలేదన్న దుగ్దతోనే కొందరు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఒక విషయం మరిచిపోతున్నారు. తెలంగాణ సాధన కోసం రాజకీయాల మాటెలా ఉన్నా, ప్రతి ఒక్కరూ రాష్ట్ర సాధన కోసం తమకు ఉన్న పరిమితుల్లో పోరాడారు. తెలంగాణ కల సాకారమై మూడేళ్లయింది.

రాష్ట్ర సాధన ఉద్యమంలో కనబర్చిన చతురతను ఎన్నికల్లోనూ అమలుచేసి నిర్విఘ్నంగా అధికారంలోకి వచ్చిన ఘనత సీఎం కే చంద్రశేఖర్‌రావుది. జరుగాల్సిన పరిణామాలు వరుసగా జరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలకు శ్రీకారం చుడితే.. మంత్రి కేటీఆర్ ద్రుష్టిలో వ్యక్తిగత ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.

ప్రజాకాంక్షల కోసమే జేఏసీ చైర్మన్ ఇలా ఒత్తిళ్లు

ప్రజాకాంక్షల కోసమే జేఏసీ చైర్మన్ ఇలా ఒత్తిళ్లు

కానీ కోదండరాం 2014లో సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందే సికింద్రాబాద్ లోక్‌సభా స్థానం నుంచి పోటీ చేయమన్న నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, నేటి సీఎం కేసీఆర్ అభ్యర్థనను మర్యాద పూర్వకంగా తిరస్కరించిన నేపథ్యం జేఏసీ చైర్మన్‌ది. తెలంగాణ సబ్బండ వర్ణాల ఆకాంక్షలకు అనుగుణంగా వాటిని నెరవేర్చాలని వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం పలు డిమాండ్లు ముందుకు తీసుకొచ్చారు. ఆ క్రమంలో వాటి అమలు కోసం అధికార పక్షంపై ఒత్తిళ్లు తెచ్చారు.

 విభిన్న వర్గాల సమస్యలపై ఆందోళన ఇలా

విభిన్న వర్గాల సమస్యలపై ఆందోళన ఇలా

తమతోపాటు భుజంభుజం కలిపి పోరాడిన కోదండరాం విపక్షాల ఆందోళనకు మద్దతు తెలపడం మంత్రి కేటీఆర్‌కు ఇష్టంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకు ఆందోళనకు ఏర్పాటుచేసే శిబిరాలన్నింటికీ ఆయన మద్దతు తెలుపాల్సిన అవసరమేమిటని మంత్రి కేటీఆర్ నేరుగానే వ్యాఖ్యానించారు. గమ్మత్తేమిటంటే అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు మొదలు ఉపాధ్యాయ నియామకాల వరకు ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేయడమే మంత్రి కేటీఆర్‌కు కష్టసాధ్యంగా పరిణమించిందని విశ్లేషకులు అంటున్నారు. దీనికితోడు లేని సమస్యలు కల్పించి అనవసర ఆందోళనలకు శ్రీకారం చుట్టారని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరోపణలకు దిగిన కేటీఆర్.. నిరుద్యోగ ర్యాలీకి పిలుపునిచ్చిన కోదండరాం ఇంటిపై దాడి చేసి.. ఫర్నీచర్ ధ్వంసం చేసి మరీ అర్థరాత్రి ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరమేమిటో మంత్రి కేటీఆర్ చెప్తే సబబుగా ఉండేదని చెప్తున్నారు.

కేసీఆర్ దీక్షకు ఇదీమూలం

కేసీఆర్ దీక్షకు ఇదీమూలం

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మినహా మరెవ్వరూ మాట్లాడలేదు. దీన్ని మూడేళ్ల పాలన ముగించుకున్న శుభ సందర్భంగా అన్యాపదేశంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర రథసారథి, మూడున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధి సీఎం కేసీఆర్. ఆ మాటకు వస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల పట్టుదలపైనే నాడు కేసీఆర్.. తెలంగాణ సాధన నిరవధిక దీక్ష కొనసాగించారు. అటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆకాంక్షలను పరిష్కరించడానికి పూనుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌దే.

ఇలా ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం

ఇలా ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం

విద్యార్థుల ఆకాంక్షలేమిటో తనకు తెలుసునని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పరిష్కరించాల్సిన సీఎం కేసీఆర్ మొహం చాటేసినందుకే విపక్షాలు ప్రశ్నించాయి. అదేమంత సమస్య కాదని, ప్రధాన వక్త మాట్లాడటమే ముఖ్యమని నాడు అంతా దాటవేశారు. కానీ వాస్తవమేటంటే ఓయూ విద్యార్థుల ఆందోళనకు కారణాలను తమదైన రీతిలో ఆరా తీసి, వాటి పరిష్కారానికి ఉద్యోగాల కల్పనే మార్గమని ప్రభుత్వం భావించిన నేపథ్యం తర్వాత వివిధ రూపాల్లో వార్తలుగా వచ్చింది. వాస్తవాలు విస్మరించి విమర్శలు చేస్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలని పాలకులు గుర్తుంచుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

1995 నుంచే ఉప ఎన్నికల్లో ఇలా

1995 నుంచే ఉప ఎన్నికల్లో ఇలా

ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలే ప్రజాభీష్టానికి గీటురాయి అని మంత్రి కేటీఆర్ మరో వాదం ముందుకు తెచ్చారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ అధికార పక్షాలదే విజయం అని అందరికీ తెలిసిన విషయమే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే విజయం సాధించిన నేపథ్యం తెలంగాణలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నది. దీన్నే గొప్ప బలంగా చెప్పుకోవడం అంటే వాపును చూసి బలుపు అని అధికార పక్షం భావన అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

2009లో మంత్రి కేటీఆర్ ఇలా అరంగ్రేటం

2009లో మంత్రి కేటీఆర్ ఇలా అరంగ్రేటం

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయం ప్రకాశితం గానీ నేత మంత్రి కేటీఆర్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన విజయం సాధించింది. తర్వాత ప్రతిసారీ మిత్రపక్షాలతో కలిసే టీడీపీ పోటీ చేసింది. వామపక్షాలు కాదంటే బీజేపీ మిత్రపక్షంగా కొనసాగింది. కానీ టీఆర్ఎస్ పరిస్థితి అందుకు భిన్నం. 2001లో కరీంనగర్ గడ్డపై ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. 2004లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్, 2009 అసెంబ్లీ, పార్లమెంట్ జమిలీ ఎన్నికల్లో టీడీపీ, లెఫ్ట్ పార్టీల మద్దతుతోనే టీఆర్ఎస్ రాజకీయ పోరాటం సాగిందన్న సంగతి అందరికీ తెలిసిన సత్యమే. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీ రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని కేంద్రం ప్రకటించిన తర్వాతే పరిస్థితి మారిపోయింది.

సీనియర్ నేతలపై మంత్రి కేటీఆర్ ఇలా

సీనియర్ నేతలపై మంత్రి కేటీఆర్ ఇలా

నాటి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో సొంతంగా శక్తి సామర్థ్యాలు గల నేతలు లేని లోటు వెంటాడింది. దాని ఫలితమే 2014లో కేసీఆర్ అధికారంలోకి రావడానికి దోహద పడిందనే విషయం నిష్ఠూరసత్యం. కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం గల నేత ముందుకు వస్తే ఫలితాలు మరోలా ఉంటాయి. ఆ మాటకు వస్తే 2009లో టీడీపీ, లెఫ్ట్ పార్టీల మద్దతుతోనే సిరిసిల్లలో నేటి మంత్రి కేటీఆర్ రాజకీయ అరంగ్రేటం ప్రారంభమైందన్న విషయం ఆయన విస్మరిస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ మూడేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జిషీట్ ప్రకటించిందని, 60 ఏళ్ల పాపాలపై కాంగ్రెస్ పార్టీని ఉరి తీయాలా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2004లో కరీంనగర్ బహిరంగసభలో ఇచ్చిన హామీకి కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు చర్యలు తీసుకున్నారు. ఆ సంగతి విస్మరించి తామే తెలంగాణ సాధించామన్న ధోరణిని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్న హామీకి కట్టుబడి బీజేపీ మద్దతు ఇవ్వకుండా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాకారం అయ్యేది కాదు. కానీ కాంగ్రెస్, బీజేపీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీలని పెద్దపెద్ద వ్యాఖ్యలు చేసి తన హుందాతనాన్ని కోల్పోయారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇందుకే సీబీఐ విచారణకు నో

ఇందుకే సీబీఐ విచారణకు నో

మియాపూర్ స్కాం తామే వెలికి తీశామని అవినీతికి తావివ్వబోమని మంత్రి కేటీఆర్ మరో మంచి కబురు చెప్పారు. కానీ రెండు ప్రైవేట్ పార్టీలు ఆ భూమి తమదేనని సుప్రీంకోర్టు వద్దకు వెళ్లినా పట్టించుకోని రెవెన్యూశాఖ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివ్రుద్ది సంస్థ (హెచ్ఎండీఏ).. వేలం వేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే గానీ బయటకు రాలేదు. తర్వాత పత్రాలు పరిశీలిస్తే వాస్తవాలు తెలిసి ప్రభుత్వం ద్రుష్టికి తెచ్చారు అధికారులు. ఇందులో ప్రస్తుతం ఒక సీనియర్ మంత్రి కూడా భోంచేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పూర్వాపరాలు వెలికి తీయాలంటే సీబీఐ విచారణ అవసరమన్న డిమాండ్లను కొట్టి పారేశారు. ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుంటే ఇతర సంస్థలకు అప్పగించడమేమిటని సరికొత్త రాగాలు తీశారు. సీబీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగితే అసలు సంగతి బయట పడుతుందన్న ఆందోళనతోనే అందుకు నిరాకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

పార్టీలో ఐక్యత ఇలా మంత్రి కేటీఆర్

పార్టీలో ఐక్యత ఇలా మంత్రి కేటీఆర్

పార్టీలో తామంతా సీఎం అధినేత కేసీఆర్ నాయకత్వంలో కలిసి పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ పదవులపై తమకు ఆశ లేదని పరోక్షంలో సహచర మంత్రి తన్నీర్ హరీశ్ రావు, ఎంపీ కల్వకుంట్ల కవితలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాస్తవంగా ఇటీవల జరిగిన పార్టీ ప్లీనంలోనే కేటీఆర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాలని సీఎం కేసీఆర్ తలపోస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మరో మంత్రి హరీశ్‌రావు పేరు ముందుకు తెచ్చింది. హరీశ్ రావు నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడ్డారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
Telangana IT Minister KT Ramarao attacks on Kodandaram while he has personal ambitions on KCR Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X