హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్వీస్ట్: పక్కింటి స్త్రీ సాయంతో నాలుగేళ్లుగా మహిళపై రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదు పాతబస్తీలోని ఓ మహిళపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత నాలుగేళ్లుగా తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ లైంగిక దా డికి పాల్పడుతూ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని భయపెట్టి బంగారు నగలు, నగదును తీసుకున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ నగర శివారులోని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధిత మహిళ భర్త దుబాయ్‌కు వెళ్లడంతో పిల్లల తో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇంటి పక్కన ఉండే ఓ మహిళ బంధువైన ఓ వ్యక్తి తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఇంటి పక్కను న్న మహిళ, ఆ వ్యక్తి ఇద్దరూ కుట్ర పన్ని కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చేవారని, స్పృహ కోల్పోయిన తర్వాత తనపై లైంగిక దాడికి పా ల్పడేవాడని బాధిత మహిళ తెలిపింది.

వివస్త్రను చేసి తీసిన ఫొటోలను, వీడియోలను నెట్‌లో పెడతానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, తనను బెదిరించి ఇప్పటి వరకు 25 తులాల బంగా రం, రూ.35 లక్షల నగదు తీసుకున్నాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. 18 నెలలుగా రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకొని అక్కడికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది.

ఆ మహిళ విషయాన్ని భర్తకు చెప్పడంతో దుబాయ్‌ నుంచి రాగానే ఇద్దరూ కలిసి పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు, అతనికి సహక రించిన మహిళపై 376, 384, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చలపతి తెలిపారు.

Twist in a rape case in Hyderabad

పోలీసు కానిస్టేబుల్‌పై మహిళ ఫిర్యాదు

రియల్‌ ఎస్టేట్‌ పేరుతో కానిస్టేబుల్‌ డబ్బులు తీసుకుని తన భర్తను బెదిరిస్తున్నాడని హైదరాబాదులోని యాకుతపురాకు చెందిన తసీం ఉన్నీసా సోమవారం మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్‌ వెస్ట్‌, నార్త్‌ జోన్‌లో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ టి.వినోద్‌ కుమార్‌ ఉప్పల్‌లో కోటి రూపాయల విలువైన భవనం రూ.70 లక్షల లోపే దొరుకుతుందని తన భర్తకు మహ్మద్‌ ఖదీర్‌కు ఫోన్‌ చేశాడని తెలిపింది. తన భర్త రూ.35 లక్షలు చెల్లించి సగం షేర్‌ని తీసుకున్నాడని చెప్పారు.

కొన్న విలువకన్నా రూ.54 లక్షలకు అధికంగా ఆ భవనాన్ని తన భర్త సంతకం ఫోర్జరీ చేశారని విక్రయించారని ఆరోపించారు. తమ డబ్బులు రూ.35 లక్షలు, లాభంలో షేర్‌ రూ.27 లక్షలు కలిపి మొత్తం రూ.67 లక్షలకు తమని మోసం చేశారని చెప్పారు. ఈ విషయంపై కమిషన ర్‌కు ఫిర్యాదు చేసినందుకు ఆ ఫిర్యాదు వాపసు తీసుకోకపోతే తన భర్తను కిడ్నాఫ్‌ చేసి చంపేస్తామని కానిస్టేబుల్‌ వికాస్‌కుమార్‌తో పాటు అతని సోదరులు వికాస్‌ కుమార్‌, అరుణ్‌ కుమార్‌ బెదిరిస్తున్నాని ఫిర్యాదులో ఆరోపించారు.

English summary
A man is sexually attacking a woman at Pahadi Shareef in Hyderabad last four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X