రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిడ్నాప్ చేసి అమ్మాయిని రేప్ చేశారు, సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తో దొరికిపోయారు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట విల్లా టౌన్‌షిప్‌లోని ఓ ఇంట్లో పది రోజుల క్రితం దొంగలు చొరబడి దోచుకోవడంతో ఆగకుండా బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన కేసులో ఇద్దరిని నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. శంషా బాద్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ సోమవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిం చారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన జితేందర్‌పాల్‌ అలియాస్‌ బబ్లూపాల్‌, అరుణ్‌శర్మ ఖానాపూర్‌ లో కొద్దికాలం టైల్స్‌ పనిచేసి తమ రాష్ట్రానికి వెళ్లిపోయారు. దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో ఈనెల 11వ తేదీన ఖానాపూర్‌ చేరుకున్నారు. గుంచా హిల్స్‌లో ఓ ఇంటిని లక్ష్యం చేసుకున్నారు. అప్పటికే పలు దొంగతనాలు చేసిన నిందితులు రెండు రోజులపాటు ఆ ఇంటిపై రెక్కీ నిర్వహిం చారు.

13వ తేదీ రాత్రి ఇంట్లోకి ప్రవేశించారు. ఒక బెడ్రూంలో భార్యాభర్తలు నిద్రిస్తుండగా, మరో బెడ్‌రూంలో వారి బంధువుల అమ్మాయి (11) నిద్రిస్తోంది. దంపతులున్న గదికి గడియపెట్టి బాలిక ఉన్న గదిలోకి ప్రవేశించి రెండు ల్యాప్‌ టాప్‌లు, మూడు సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను దొంగిలించారు. ఆ సమయంలో బాలిక నిద్ర నుంచి లేచి కేకలు వేయడానికి ప్రయత్నించింది.

Two arrested in kidnap and rape case in Rangareddy district

దాంతో నోట్లో దుస్తులు కుక్కి, బెడ్‌షీట్‌లో చుట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలిక వారి నుంచి తప్పించుకొని సెక్యూరిటీ సిబ్బందిని నిద్రలేపింది. వారు ఇంటి యజమానికి జరిగిన విషయం చెప్పారు. నిందితులు మర్నాడు గండిపేట వీకర్‌సెక్షన్‌ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి రూ.75వేలు అపహరించి ఉత్తరప్రదేశ్‌ పారిపోయారు.

సెల్‌ఫోన్లు దొంగిలించిన నిందితులు వాటిని వాడుతుండగా సిగ్నల్స్‌ ఆధారంగా వారికోసం పోలీసులు వేట ప్రారంభించారు. వాళ్లు మరోసారి హైదరాబాద్‌ వస్తున్నారని తెలుసుకుని కాపు కాసి ఖానాపూర్‌ కల్లు కాంపౌండ్‌కి సోమవారం రాగానే పట్టుకున్నారు. నిందితుల నుంచి ల్యాప్‌ టాప్‌, రెండు సెల్‌ఫోన్‌లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

English summary
Two arrested in a kidnap and rape case in Rangareddy district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X