ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మహిళా కార్మికుల మృతి

Subscribe to Oneindia Telugu

వరంగల్: శనివారం ఉదయం తెల్లవారుజామున గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వరంగల్‌ పరిధిలోని మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు పారిశుద్ధ్య మహిళా కార్మికులు మృతి చెందారు.

మామునూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్‌ పోలీస్‌ శోభన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం నుంచి వస్తున్న ఒక లారీ వరంగల్‌ పట్టణం నుండి మామునునూకు వెళ్తున్న ఆటోను ఢీకొనగా ఇద్దరు మహిళా కార్మికులు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

Two die in a road accident in Warangal

మరణించిన కార్మికులు కె. సులోచన (45), ఎస్‌. మరియమ్మ (53) వీరిద్దరు మామునూరు ప్రాంతానికి చెందినవారు. ఆరుగురు కార్మికులు ఆటోలో వరంగల్‌ పట్టణంలోని పెట్రోల్ బంక్‌ వద్ద వేలిముద్రల హాజరు వేసుకోవడాికి మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చారు. హాజరు వేసిన తరువాత ఆోలో తిరిగి పారిశుద్ధ్య కార్యక్రమానికి మామునూరు వెళ్తుండగా మామునూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

తీవ్రంగా గాయపడిన నలుగురిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌, కమిషనర్‌ శృతి ఓజా ఎంజీఎంకు వెళ్లి మృతదేహాలను, గాయపడిన వారిని సందర్శించారు.

మేయర్‌ విలేకరులతో మ్లాడుతూ రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి కె. రామారావు ఆదేశాల మేరకు మరణించివారికి రూ. 5 లక్షల ప్రభుత్వం ఆర్థిక సహాయం, కార్పొరేషన్‌ నుంచి రూ. 50వేల ఆర్థిక సహాయం, గాయపడినవారికి రూ.25వేల ఆర్థిక సహాయం, మెరుగైన వైద్యం అందేలా చూస్తామని తెలిపారు. కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుటామని ఆయన తెలిపారు.

Gurgaon mother gangraped in auto, infant thrown out | Oneindia News
English summary
Two women workrs died in road accident at Mamunooru in Warangal corporations limit of Telangana.
Please Wait while comments are loading...