హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిలింనగర్లో కుప్పకూలిన భవనం, శిథిలాల కింద కూలీలు, చిత్ర పరిశ్రమదేనా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జుబ్లీహిల్స్‌లోని ఫిలిం నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం ఆదివారం నాడు కూలిపోయింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు ఆనంద్, హమీద్ షేక్. బాధితులంతా బెంగాల్ వాసులు. మరో పది మంది కూలీల వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.

ఒకేసారి ఎనిమిది పిల్లర్లు కూలినట్లు చెబుతున్నారు. మొత్తం పద్నాలుగు పిల్లర్లు నేలమట్టం అయ్యాయి. ప్రమాదంలో గాయపడిన పదిమంది కూలీలను అపోలో ఆసుపత్రికి తరలించారు. మరో పదిమంది శిథిలాల కింద ఉన్నారంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

శిథిలాల కింద కూలీలు ఉన్న నేపత్యంలో కాంక్రీట్ శ్లాబులను పగలగొడుతున్నారు. ఈ భవనం కూలిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా, ఈ భవనాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ సాంస్కృతిక సంఘం ఫిలింనగర్ కల్చరల్ అసోసియేషన్ స్వయంగా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

భవన నిర్మాణంలో నాసిరకం సిమెంటును వాడటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అదే సమయంలో రెండు వారాల వ్యవధిలో రెండు ఫ్లోర్లను ఇక్కడ వేయడం, ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో నిర్మాణం చేపట్టడం వల్ల కుప్పకూలినట్లుగా భావిస్తున్నారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి

కేసీఆర్ దిగ్భ్రాంతి

భవనం కూలిపోయిన ఘటన పైన ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూ తి తెలిపారు.

కూలిన భవనం

కూలిన భవనం

ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

పీజేఆర్ కూతురు విజయ

పీజేఆర్ కూతురు విజయ

భవనం కూలిన ప్రాంతాన్ని తెరాస నాయకురాలు, కార్పోరేటర్ విజయ సందర్శించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.

కూలిన భవనం

కూలిన భవనం

నాసిరకం పనుల వల్లనే భవనం కూలిందని అంటున్నారు. కాంట్రాక్టర్ కక్కుర్తికి ఇద్దరు కూలీలు బలయ్యారని మండిపడుతున్నారు.

కూలిన భవనం

కూలిన భవనం

కాంట్రాక్టర్, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. పిల్లర్ల లోపల ప్లాస్టిక్ పైపులు పెట్టి నిర్మాణం చేపట్టారు. పిల్లర్ల లోపల వేసిన ప్లాస్టిక్ పైపుల్లో ఇసుక నింపారు. ఇదే ప్రమాదానికి కారణం అంటున్నారు.

కిషన్ రెడ్డి ఆగ్రహం

కిషన్ రెడ్డి ఆగ్రహం

ఘటన ప్రాంతాన్ని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాుర. నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం కూలడానికి కారణం అనుభవం లేని ఇంజినీర్లే అన్నారు. పిల్లర్లకు పిల్లర్లకు మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, ఎటువంటి మెటీరియల్ వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి సదరు ఇంజినీర్‌కు పూర్తిగా తెలియవన్నారు.

కిషన్ రెడ్డి ఆగ్రహం

కిషన్ రెడ్డి ఆగ్రహం

ఈ సంఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా సరిపోవన్నారు. వారికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. సంఘటన స్థలానికి మాజీ ఎమ్మెల్యే విష్ణు వచ్చారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బొంతు రామ్మోహన్

బొంతు రామ్మోహన్

ఫిలిం నగర్‌లో కూలిన భవనం వద్దకు వచ్చిన హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్. వివరాలను ఆరా తీశారు.

 కూలిన భవనం

కూలిన భవనం

భవనం కూలిన ఘటనలో మృతి చెందిన ఇద్దరు, గాయపడ్డ బాధితులు అందరూ బెంగాల్‌కు చెందిన వారే. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బొంతు రామ్మోహన్

బొంతు రామ్మోహన్

ఫిలిం నగర్‌లో కూలిన భవనం వద్దకు వచ్చిన హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్. వివరాలను ఆరా తీశారు.

విజయ

విజయ

ఫిలిం నగర్‌లో కూలిన భవనం వద్దకు వచ్చిన హైదరాబాద్ నగర కార్పోరేటర్ విజయ. మరోవైపు, జేసీబీతో కొనసాగుతున్న సహాయక చర్యలు.

English summary
Two feared dead as under construction building collapses in Film Nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X