హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీచర్ కోపానికి స్కూల్లో నలిగిపోయిన చిన్నారి చేతి వేళ్లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లోని రవీంద్ర భారతి స్కూలులో దారుణం జరిగింది. ఓ టీచర్ కోపానికి ఎల్‌కేజీ విద్యార్థిని చేతి రెండు వేళ్లు నలిగిపోయాయి. వివరాల్లోకి వెళితే ఎల్‌కేజీ చదువుతున్న హారిణి హోంవర్క్ చేయకుండా శనివారం స్కూలుకు వచ్చింది.

Two fingers cut from girl student in ravindra bharathi school at kukatpally

హోంవర్క్ చేయకపోవడంతో టీచర్ కొడుతుందేమోనని అనుకున్న హారిణి భయంతో పరుగెత్తింది. ఈ క్రమంలో కోపం తెచ్చుకున్న టీచర్ తలుపును గట్టిగా వేశాడు. అదే సమయంలో హారిణి చేతివేళ్లు తలుపుల మధ్యలో పడి చివరి భాగంలో నుజ్జునుజ్జయ్యాయి.

దీంతో స్కూల్ యాజమాన్యం ఆయాతో చిన్నారి హారిణిని ఇంటికి పంపించారు. కంగారుపడిపోయిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రులు టీచర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ నిర్వాకంపై బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

ఫీజుల కోసం నల్గొండ విద్యార్ధులు ఆందోళన

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. జల్లాలోని మోత్కూర్‌లోని కళాశాలల విద్యార్థులు శనివారం తరగతులు బహిష్కరించి, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

మధ్యాహ్న భోజనం వికటించిన చిన్నారులకు అస్వస్థత

Two fingers cut from girl student in ravindra bharathi school at kukatpally

మధ్యాహ్న భోజనం వికటించిన చిన్నారులకు అస్వస్థతకు గురైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం నర్సాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 23 మంది బాలురకు వాంతులు, కడుపునొప్పితో బాధపడటంతో అందరినీ ఖానాపూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురికి సెలైన్ ఎక్కిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని చికిత్సను అందించిన వైద్యులు తెలిపారు.

English summary
Two fingers cut from girl student in ravindra bharathi school at kukatpally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X