హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదే నాటుతుపాకీ: రీఛార్జీ ఆధారంగా కాల్పుల కేసులో నిందితుల అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగర శివారులోని కాటేదాన్‌ కాల్పుల ఘటనను పోలీసులు ఛేదించారు. 36 గంటలు గడవకముందే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ శశిధర్‌రెడ్డి, శంషాబాద్‌ డీసీపీ ఎఆర్‌ శ్రీనివాస్‌తో కలిసి సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో నగర శివారులోని జల్‌పల్లి శ్రీరాంనగర్‌కు చెందిన రాహుల్‌శర్మ(25), వికాస్‌(24)లను అరెస్ట్‌ చేశామని తెలిపారు. నాటుతుపాకీ, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వీరిద్దరు ఆరేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి శ్రీరాంనగర్‌లో ఉంటున్నట్లు తెలిపారు.

వీడిన కాల్పుల మిస్టరీ: ప్రసాద్‌పై కాల్పులకు తెగబడింది యూపీ ముఠానేవీడిన కాల్పుల మిస్టరీ: ప్రసాద్‌పై కాల్పులకు తెగబడింది యూపీ ముఠానే

రాహుల్‌శర్మకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ హత్యకేసుతో సంబంధముందని తెలిపారు. ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వెళ్లిన రాహుల్‌శర్మ నాటుతుపాకీతోపాటు రెండు తూటాల్ని కొనుగోలు చేసినట్లు గుర్తించామని కమిషనర్‌ వెల్లడించారు. కాటేదాన్‌ ఎస్‌బీఐ బ్యాంకుకు అనుబంధంగా పనిచేసే జియోసెన్సార్‌ సంస్థ ఉద్యోగి మేకా ప్రసాద్‌పై మే 2న కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

కాగా, సెల్‌ రీఛార్జి ఆధారంగా దర్యాప్తు కొనసాగించడంతో నిందితుల గుర్తింపు తేలకైంది. రాహుల్‌శర్మ నగదు బదిలీ చేసిన ఖాతా ఆధారంగా ఉత్తర్‌ప్రదేశ్‌ చిరునామాను పోలీసులు కనుగొన్నారు. అయితే ఖాతా తెరిచేటప్పుడు ఇచ్చిన చరవాణి నంబరును మార్చేయడం.. ఆ చిరునామా నుంచి నిందితుడి కుటుంబం మారిపోవడంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది.

కానీ, ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి రెండుసార్లు ఓ సెల్‌ఫోన్‌కు రీఛార్జి చేసినట్లు గుర్తించి ఆ నంబరు లొకేషన్‌ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఘాతుకానికి పాల్పడిన దుండగులు ఉత్తర్‌ప్రదేశ్‌ పారిపోయేందుకు నాంపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అయితే అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని గుర్తించిన నిందితులు శివారులో తలదాచుకోగా ఆ స్థావరంపై దాడి చేసి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

కాటేదాన్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్

కాటేదాన్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్‌ నగర శివారులోని కాటేదాన్‌ కాల్పుల ఘటనను పోలీసులు ఛేదించారు. 36 గంటలు గడవకముందే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు.

కాటేదాన్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్

కాటేదాన్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్

సైబరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ శశిధర్‌రెడ్డి, శంషాబాద్‌ డీసీపీ ఎఆర్‌ శ్రీనివాస్‌తో కలిసి సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

కాటేదాన్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్

కాటేదాన్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్

కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో నగర శివారులోని జల్‌పల్లి శ్రీరాంనగర్‌కు చెందిన రాహుల్‌శర్మ(25), వికాస్‌(24)లను అరెస్ట్‌ చేశామని తెలిపారు.

కాటేదాన్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్

కాటేదాన్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్

నాటుతుపాకీ, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వీరిద్దరు ఆరేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి శ్రీరాంనగర్‌లో ఉంటున్నట్లు తెలిపారు.

కాటేదాన్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్

కాటేదాన్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్

రాహుల్‌శర్మకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ హత్యకేసుతో సంబంధముందని తెలిపారు. ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వెళ్లిన రాహుల్‌శర్మ నాటుతుపాకీతోపాటు రెండు తూటాల్ని కొనుగోలు చేసినట్లు గుర్తించామని కమిషనర్‌ వెల్లడించారు.

నేరచరిత వాహనాల కోసం

నేరచరిత వాహనాల కోసం

నేర చరిత వాహానాల కోసం పహాడీ షరీఫ్ స్టేషన్ పరిధిలో స్థల సేకరణ.

ఇంకుడు గుంతలు

ఇంకుడు గుంతలు

నీటి ఎద్దడిని నివారించేందుకు ఇంకుడు గుంతలు తవ్వుతున్న కమిషనర్ సీవీ ఆనంద్, అధికారులు.

English summary
Two persons from Firozabad district in Uttar Pradesh were caught by the Cyberabad police for allegedly firing at an employee of a private financial institution reported at Katedan two days ago, when he resisted their attempt to loot the cash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X