హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్‌లో ఆ రోడ్డుకు బ్రిటిష్ క్రూరుడి పేరు, ఎన్డీయే కీలక నిర్ణయం

సికింద్రాబాద్ డైమండ్ పాయింట్ సమీపంలో ఉన్న నికొల్సన్ రోడ్డు పేరును మార్చాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్ డైమండ్ పాయింట్ సమీపంలో ఉన్న నికొల్సన్ రోడ్డు పేరును మార్చాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. బంగ్లా యుద్ధ వీరుడు అరుణ్ ఖేతర్ పాల్ రోడ్డుగా మార్చాలని నిర్ణయించినట్లుగా ఆంగ్ల మీడియాలో వార్త వచ్చింది.

భారత సైన్యంలో సెకండ్ లెఫ్టినెంటుగా ఉన్న ఖేతర్ పాల్ 1971 యుద్ధంలో అమరుడయ్యారు. జూన్ 13వ తేదీన కంటోన్మెంట్ బోర్డు పేరు మార్పును సిఫార్సు చేస్తూ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఢిల్లీలోని స్టేషన్ హెడ్ క్వార్టర్సుకు పంపించారు.

నికొల్సన్ రోడ్డు పేరు వెనుక పెద్ద చరిత్ర

నికొల్సన్ రోడ్డు పేరు వెనుక పెద్ద చరిత్ర

ఇప్పటి వరకు ఆ రోడ్డుకు ఉన్న నికొల్సన్ పేరు త్వరలో మారనుంది. ఆ రోడ్డు చాలా చిన్నది. దానికి బ్రిటిష్ కాలంలో నికొల్సన్ రోడ్డుగా పేరు పెట్టారు. ఈ నికొల్సన్ క్రూరమయిన చరిత్ర ఉన్న బ్రిటిష్ అధికారి. ఆ రోడ్డును నికొల్సన్ రోడ్డుగా పిలుస్తారు. కానీ చాలామందికి దీని చరిత్ర తెలియదు. అది చిన్న గల్లీ అయినప్పటికీ.. ఆ పేరు వెనుక పెద్ద చరిత్ర ఉంది.

నికోలన్స్ వారికి హీరోగా నిలిచాడు

నికోలన్స్ వారికి హీరోగా నిలిచాడు

నికొల్సన్ బ్రిటిష్ వాళ్లకు జానపద హీరోగా నిలిచాడు. ఆయన మీద లెక్కలేనన్ని నవలలు, పుస్తకాలు వచ్చాయి. రడ్వార్డ్ కిప్లింగ్ నవల కిమ్‌లో నికోల్సన్ ప్రస్తావన ఉంది. కిమ్ ఒక బౌద్ధబిక్షువులో కలిసి యాత్రలు చేస్తున్నప్పుడు ఒక మిలటరీ ఆఫీసర్‌ను కలుసుకుంటాడు. ఆ అఫీసరే నికోల్సన్. 19 శతాబ్ధంలో తెల్ల వారికి అతను పెద్ద స్ఫూర్తి.
నికోల్సన్ పూర్తి పేరు జాన్ నికోల్సన్. అతను 1821-1857 మధ్య జీవించాడు. ఐర్లాండ్ దేశస్తుడు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సైన్యంలో బ్రిగేడియర్ జనరల్ స్థాయికి ఎదిగాడు. మిలిటరీలోనే కాకుండా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఫ్రావిన్సులో అధికారిగా పని చేశాడు. అక్కడా ఈస్టిండియా కంపెనీకి సేవలు అందించాడు.

నికోల్సన్ క్రూరత్వాలు

నికోల్సన్ క్రూరత్వాలు

1857లో సిపాయిల తిరుగుబాటును అణిచివేయడంలపో ముందున్నాడు. తిరుగుబాటుదారులను క్రూరంగా చంపించాడు. జలంధర్ కంటోన్మంటులో ఉన్న భారతీయ వంటవాళ్లను విచారణ లేకుండా చెట్టుకు ఉరి తీయించాడు. వాళ్లంతా తనను చంపేందుకు సూప్‌లో విషం కలిపారని ఆయన అనుమానం. భారతీయ తిరుగుబాటుదారులు అంటే ఆయనకు కోపం. వాళ్లను ఎలా చంపాలనే దానిపై ఆయనకు ఒక పద్ధతి ఉంది.

ఎంత క్రూరుడు అంటే..

ఎంత క్రూరుడు అంటే..

సజీవంగా తిరుగుబాటుదారుల చర్మం ఒలిచేయాలని, సజీవంగా దహనం చేయాలని, తాను అయితే వారిని, భరించలేనంత హింసించి, చంపుతానని నికోల్సన్ చెప్పాడని అంటారు. అందుకే అతను బ్రిటిష్ జానపద హీరో అయ్యాడు. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఢిల్లీలో గాయపడి సెప్టెంబర్ 23, 1857లో ఢిల్లీ కంటోన్మెంట్ బంగ్లాలో చనిపోయాడు. అతనికి విక్టోరియన్ ఆఫ్ ఢిల్లీ అని బిరుదు ఇచ్చారు. అతని పోరాటపటిమికు గుర్తుగా సికింద్రాబాదులోని చిన్న మార్గానికి 1857లో నికోల్సన్ పేరు పెట్టారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం నికోల్సన్ పేరును తొలగించి.. అరుణ్ ఖేతర్ పాల్ పేరును పెట్టాలని నిర్ణయించింది.

English summary
The NDA government's penchant to 'set right' history has now hit Secunderabad. Suddenly waking up to the fact that Nicholson Road in the Cantonment area has been named after an Irish brigadier general of East India Company who brutally suppressed the Mutiny of 1857, the defence ministry in Delhi decided to rechristen it as Khetarpal Road. Arun Khetarpal was a 2nd lieutenant in the Indian Army who was martyred in the 1971 IndoPak war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X