హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొట్టొచ్చిన నిర్లక్ష్యం: కేసీఆర్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, అందని ప్రభుత్వ పథకాలు, భారంగా మారిన కుటుంబపోషణ... ఎదిగిన తనకు ఉపాధి లేకపోవడం వంటి కారణాలతో మనస్తాపానికి గురైన యువకుడు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

 మిడ్‌మానేరు కట్టను పరిశీలించేందుకు వచ్చిన కేసీఆర్

మిడ్‌మానేరు కట్టను పరిశీలించేందుకు వచ్చిన కేసీఆర్


గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నిండిన జలాశయాలతోపాటు తెగిన మిడ్‌మానేరు కట్టను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు వచ్చారు. ముందుగా జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన కలెక్టరేట్‌లో వరద ఉధృతి, చేపట్టిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు.

 కేసీఆర్ ఏరియల్ వ్యూ

కేసీఆర్ ఏరియల్ వ్యూ


అనంతరం హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ ద్వారా జలాశయాలను పరిశీలించేందుకు కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చి, కాన్వాయ్‌లోకి చేరుకుంటుండగా పక్కనే ఉన్న యువకుడు పురుగుల మందు తాగడం కరీంనగర్‌లో చర్చనీయాంశమైంది. యువకుడిని హుటాహుటిన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది.

 యువకుడి పేరు పర్వతం గోపి

యువకుడి పేరు పర్వతం గోపి


ఆత్మహత్యాయత్నానికి యత్నించిన యువకుడి పేరు పర్వతం గోపి
వివరాల్లోకి వెళితే... మహదేవ్‌పూర్‌మండలం ఎడపల్లికి చెందిన పర్వతం లక్ష్మిమల్లు(70) గ్రామంలో కూలీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు పర్వతం గోపి (25)ఉన్నారు. లక్ష్మిమల్లుకు 70 ఏళ్లు ఉండగా ఆధార్‌ కార్డులో 22 ఏళ్లుగా వయసు తప్పుగా పడింది.

 ఫించను కోల్పోయిన తండ్రి

ఫించను కోల్పోయిన తండ్రి


దీంతో పింఛనుకు అర్హత కోల్పోయాడు. విషయంపై అతని కుమారుడు పర్వతం గోపి కొన్ని రోజుల కిందట ఈ సేవలో మార్పు చేయించాడు. తన తండ్రికి పింఛను, తనకు ఉపాధి కల్పించాలని జిల్లా పాలనాధికారికి విన్నంవించుకునేందుకు గోపి సోమవారం కరీంనగర్‌ వచ్చాడు.

 అధికారుల సమావేశంలో కేసీఆర్

అధికారుల సమావేశంలో కేసీఆర్

మానేరు జలాశయం గేట్లు తెరుస్తున్నందున జిల్లా కలెక్టర్‌ అక్కడికి వెళ్లారు. విషయం గోపికి తెలిసి మానేరు జలాశయం వద్ద కలెక్టర్‌ను కలుద్దామని అక్కడికి వెళ్లగా వీలుపడలేదు. తిరిగి కలెక్టరేట్‌ వద్దకు వచ్చిన గోపికి కలెక్టరేట్‌లో మంత్రుల సమావేశం ఉందని, కలెక్టర్‌ను కలిసే అవకాశం ఉండదని తెలిసింది.

 పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం

పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం

మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం
ఎలాగైనా కలెక్టర్‌ను కలవాలని వచ్చిన గోపి మనస్తాపానికి గురై ముందే తనతో తెచ్చుకున్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే దీనిని గమనించిన పోలీసులు అతనిని సమీపించి, పురుగుల మందు డబ్బాను లాక్కొని, వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 సమస్యను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పుట్ట మధు

సమస్యను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పుట్ట మధు


యువకుడి సమస్యను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పుట్ట మధు
యువకుడు తనవెంట తెచ్చుకున్న సర్టిఫికెట్లు సంఘటనా స్థలంలోనే వదిలివెళ్ళగా, ఎంపీ వినోద్‌కుమార్ వాటిని గమనించి వాటితో సదరు వ్యక్తి వివరాలు సేకరించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలిసిన మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆసుపత్రికి చేరుకొని యువకుడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

English summary
A youth tried to commit suicide by consuming insecticide in front of the convoy of the Telangana Chief Minister K Chandrashekhar Rao in Karimnagar today, police said. Deputy superintendent of police J Rama Rao said that P Gopi (24) from Edapalli village in Mahadevpur mandal had come here to submit an application to the District Collector seeking a job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X