వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగాదాలొద్దు: బాబు వర్సెస్ కెసిఆర్‌పై ప్రణబ్ పరోక్ష వ్యాఖ్య, హైద్రాబాద్ దేశానికే ఇష్టం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు రాసిన ఉనికి పుస్తకాన్ని శుక్రవారం నాడు హెచ్ఐసీసీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాను రాష్ట్రపతి ప్రణబ్ వద్దకు వెళ్లానని చెప్పారు. అంతకుముందే తాను ఓసారి కలిసినప్పుడు అంత తొందరపాటు వద్దని, కొంత ఆవేశం తగ్గించుకోమని సూచించారన్నారు.

విద్యాసాగర రావు విలక్షణమైన రాజకీయ నాయకుడన్నారు. కష్టనష్టాలను ఆయన ఎన్నో చూశారన్నారు. తాను అనుకున్న సిద్ధాంతం కోసం పని చేసే వ్యక్తి విద్యాసాగర రావు అన్నారు. విద్యాసాగర్‌రావు జీవితం పోరాటలతో ముడిపడి ఉందన్నారు.

ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్ముకున్న సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటారని కొనియాడారు. ఉద్యమ కాలంలో విద్యాసాగర్ రావుతో కలిసి పని చేసే అవకాశం కలిగిందని గుర్తు చేసుకున్నారు.

బతికున్నప్పుడే రాష్ర్టాన్ని సాధించిన ధన్యజీవిగా ప్రణబ్ తనను ప్రశంసించారన్నారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు మీద ప్రణబ్ సంతకం చేయడం మన అదృష్టమన్నారు. రాజ్యసభలో బిల్లు పాస్ అయినప్పుడు మేం పొందిన ఆనందం వెలకట్టలేనిదన్నారు.

UNIKI book launch in Hyderabad

ఉనికి పుస్తకావిష్కరణకు హాజరైనందుకు సంతోషంగా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. తనకు విద్యాసాగర రావు ఎంపీగా ఉన్నప్పటి నుండి తెలుసునని చెప్పారు. హైదరాబాదును కేవలం ఏపీ, తెలంగాణ ప్రజలే కాకుండా దేశప్రజలందరికీ ఇష్టమే అన్నారు.

హైదరాబాద్ వివిధ సంస్కృతుల సమ్మేళనమన్నారు. తెలుగు రాష్ట్రాల విభేదాల పైన ప్రణబ్ పరోక్షంగా స్పందించారు. తగాదాలు రెండు రాష్ట్రాల అభివృద్ధికి అవరోధమన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధికి రాష్ట్రీయ సంబంధాలు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇష్టమున్నా లేకున్నా పొరుగు రాష్ట్రాలతో కలిసి వెళ్లాల్సిందేనన్నారు. దేశాభివృద్ధి కోసం అందరు కలిసి పని చేయాలన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు హైదరాబాదులో ఉన్నారన్నారు.

జానా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావుతో 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. బలహీన పడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉనికి పుస్తకం కొత్త శక్తినిస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ఉనికి కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ఉనికి పుస్తకం భావితరాలకు స్ఫూర్తి అన్నారు. ప్రతి ఒక్కరు పదిమందికి ఉపయోగపడాలన్నారు.

తెలంగాణ ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బండారు దత్తాత్రేయ అన్నారు. అస్తిత్వం లేకుంటే వ్యక్తిత్వం ఉండదన్నారు. విద్యాసాగర్ రావు ఆలోచనా విధానమే ఆయనకు గుర్తింపు తెచ్చిందన్నారు. విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ కావడం సంతోషంగా ఉందన్నారు.

English summary
Maharashtra governor Vidyasagar Rao's UNIKI book launch in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X