వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: 2019 లోపే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది.ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కేబినేట్ నోటును సిద్దం చేస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది.ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కేబినేట్ నోటును సిద్దం చేస్తోంది.ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ధృవీకరించారు.

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలనే డిమాండ్ ఉంది.ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు , ఆంద్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలున్నాయి.ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలను పెంచుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

ఈ మేరకు రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని తమ తమ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరాయి. అయితే ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చిన్న సవరణ చేస్తే ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో కూడ అసెంబ్లీ స్థానాలను పెంచుకొనే వెసులుబాటు ఉంది.

తక్కువ అసెంబ్లీ సీట్లు ఉంటే రాజకీయ సుస్థితర కూడ ఉండదనే అభిప్రాయం కూడ ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడ ఈ రకమైన పరిస్థితిని తరచూ చూస్తుంటాం. దీంతో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచుకోవడం వల్ల రాజకీయ సుస్థితర ఉండే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రెండు సీట్ల పెంపుకు కేంద్రం సానుకూలత

తెలుగు రాష్ట్రాల్లో రెండు సీట్ల పెంపుకు కేంద్రం సానుకూలత

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కేబినేట్ నోటును సిద్దం చేస్తోంది.ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయాన్ని ధృవీకరించారు.అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ఇప్పట్లోనే లేదని లోక్ సభలో కేంద్ర హోంశాఖ సహయమంత్రి హన్స్ రాజ్ ప్రకటించిన కొద్దిసేపటికే వెంకయ్యనాయుడు ఈ విషయాన్ని చెప్పారు.

అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకొన్న కేంద్ర న్యాయశాఖ

అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకొన్న కేంద్ర న్యాయశాఖ

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై కేంద్ర న్యాయశాఖ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకొంది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ప్రక్రియను 2026 వరకు చేపట్టకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ని ప్రవేశపెట్టినందున , అప్పటివరకు అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేయరాని అటార్నీ జనరల్ కేంద్రానికి నివేదిక ఇచ్చారు.

2021 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పెంపు

2021 జనాభా లెక్కల ఆధారంగా 2026 లో అసెంబ్లీ నియోజవకర్గాల పెంపు సాధ్యమని అటార్నీ జనరల్ కేంద్ర న్యాయశాఖకు నివేదికను సమర్పించారు.అయితే ఎపి, తెలంగాణ రాష్ట్ర శాసనసభల్లో సీట్ల పెంచుకొనేందుకుగాను విభజన చట్టం వెసులుబాటు కల్పిస్తోంది.అయితే రాజ్యాంగం మాత్రం అనుమతించడం లేదు.

170 ఆర్టికల్ సవరిస్తే అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి

170 ఆర్టికల్ సవరిస్తే అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి

రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ని సవరించకుండా అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచే అవకాశం లేదు. అయితే ఎపి పునర్విభజన చట్టంలోని చిన్న సవరణ ద్వారా అసెంబ్లీ స్థానాలను పెంపు సాధ్యమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు న్యాయనిపుణులు.టిఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం నాడు అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై వేసిన ప్రశ్నకు హన్స్ రాజ్ ఇప్పట్లో ఈ ప్రశ్నే లేదని ప్రకటించారు.దీంతో రెండు రాష్ట్రాల్లోని పార్టీ నాయకుల మద్య ఆందోళన కన్పించింది.

అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై వెంకయ్య ఆరా

అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై వెంకయ్య ఆరా

పార్లమెంట్ లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేదంటూ కేంద్ర మంత్రి హన్స్ రాజ్ ప్రకటన విషయమై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరా తీశారు.కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఈ విషయమై చర్చించారు.అయితే అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై కేబినేట్ నోటు సిద్దమౌతోందని రాజ్ నాథ్ సింగ్ కేంద్రమంత్రి వెంకయ్యకు సమాధానమిచ్చారు.అయితే దీంతో త్వరలోనే రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెరిగేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకొంటుంది.

అసెంబ్లీ స్థానాలు ఇలా పెరుగుతాయి

అసెంబ్లీ స్థానాలు ఇలా పెరుగుతాయి

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి.అయితే వీటిని 175 నుండి 225 స్థానాలకు పెంచనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిని 153 స్థానాలకు పెంచుకొనేందుకుగాను విభజన చట్టం వెసులుబాటు కల్పించింది. అయితే ఈ విషయమై పరిపాలనా పరమైన నివేదిక ఇవ్వాలని కేంద్ర న్యాయశాఖ రెండు రాష్ట్రాలను కోరింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై కేంద్ర హోంశాఖ నోట్ ను సిద్దం చేస్తోంది.2019 ఎన్నికల లోపుగానే పెంచిన సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఫిరాయింపుదారులకు భలే చాన్స్

ఫిరాయింపుదారులకు భలే చాన్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల్లోకి విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిరాయించారు.అయితే అసెంబ్లీ సీట్ల పెరిగితే అందరికీ అసెంబ్లీ సీట్ల కేటాయింపు సాధ్యం కానుంది. ఒకవేళ 2014 తరహలోనే సీట్లు ఉంటే సీట్ల కేటాయింపు మాత్రం అన్ని పార్టీలకు ఇబ్బంది తప్పదు. ప్రత్యేకించి అధికార పార్టీకి మాత్రం ఇబ్బందులు తలనొప్పిగా మారే ప్రమాదం లేకపోలేదు.

English summary
union home ministry prepare to increase assembly seats in telugu states.union minster venkaiah naidu confirmed this statement.before 2019 elections assembly seats will increase in both states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X