హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానికి ఎల్ఈడి వెలుగులు: 500కోట్లతో పరిశ్రమ ఏర్పాటు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఎల్‌ఇడి విద్యుద్దీపాల తయారీ పరిశ్రమ స్థాపనకు అమెరికాకు చెందిన ప్రముఖ అడ్వాన్స్‌డ్ ఆప్ట్రానిక్ డివైసెస్ ఇంటర్నేషనల్ కంపెనీ ముందుకొచ్చింది. క్యాంపు కార్యాలయంలో సోమవారం అడ్వాన్స్‌డ్ ఆప్ట్రానిక్ డివైసెస్ ఇంటర్నేషనల్‌తో (ఎఒడి) కలిసి భారత్‌కు చెందిన సిస్కా మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిశారు.

పరిశ్రమ స్థాపనకు అవసరమయ్యే భూమి కేటాయించడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు వీలైనంత త్వరగా సమకూర్చుతామని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ హామీఇచ్చారు. కాగా, ప్రభుత్వ సహకారం ఉంటే వచ్చే మార్చినాటికల్లా తమ ఉత్పత్తులను ప్రారంభించి ప్రత్యేక్షంగా 2 వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

ఎల్‌ఇడి దీపాల తయారీ యూనిట్ స్థాపనకు రూ.500 కోట్ల పెట్టుబడితో పాటు 50 ఎకరాల భూమి అవసరం అవుతుందని వివరించారు. పరిశ్రమ స్థాపనకు సరిపడా స్థలాన్ని వెంటనే సమకూరిస్తే వచ్చే మార్చికల్లా ఉత్పత్తి ప్రారంభించి 2 వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించగలమన్న ప్రతిపాదనను సిఎంకు అందించారు.

సిఎంతో ప్రతినిధులు

సిఎంతో ప్రతినిధులు

హైదరాబాద్ నగరంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఎల్‌ఇడి విద్యుద్దీపాల తయారీ పరిశ్రమ స్థాపనకు అమెరికాకు చెందిన ప్రముఖ అడ్వాన్స్‌డ్ ఆప్ట్రానిక్ డివైసెస్ ఇంటర్నేషనల్ కంపెనీ ముందుకొచ్చింది.

సిఎంతో ప్రతినిధులు

సిఎంతో ప్రతినిధులు

క్యాంపు కార్యాలయంలో సోమవారం అడ్వాన్స్‌డ్ ఆప్ట్రానిక్ డివైసెస్ ఇంటర్నేషనల్‌తో (ఎఒడి) కలిసి భారత్‌కు చెందిన సిస్కా మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిశారు.

సిఎంతో ప్రతినిధులు

సిఎంతో ప్రతినిధులు

పరిశ్రమ స్థాపనకు అవసరమయ్యే భూమి కేటాయించడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు వీలైనంత త్వరగా సమకూర్చుతామని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ హామీఇచ్చారు.

సిఎంతో ప్రతినిధులు

సిఎంతో ప్రతినిధులు

కాగా, ప్రభుత్వ సహకారం ఉంటే వచ్చే మార్చినాటికల్లా తమ ఉత్పత్తులను ప్రారంభించి ప్రత్యేక్షంగా 2 వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

సిఎంతో ప్రతినిధులు

సిఎంతో ప్రతినిధులు

ఎల్‌ఇడి దీపాల తయారీ యూనిట్ స్థాపనకు రూ.500 కోట్ల పెట్టుబడితో పాటు 50 ఎకరాల భూమి అవసరం అవుతుందని వివరించారు.

సిఎం కెసిఆర్ స్పందిస్తూ.. 50 ఎకరాల భూమిసహా ఇతర మౌలిక సదుపాయాలు అతి తక్కువ వ్యవధిలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు. తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుగునిచ్చే ఎల్‌ఇడి దీపాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. ఎల్‌ఇడి దీపాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తే వీటికి డిమాండ్ పెరుగుతుందని సిఎం అన్నారు.

తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ప్రవేశపెట్టిన టిఎస్‌ఐపాస్ విధానం సత్ఫలితాలు ఇస్తుందని, ఇప్పటికే 69 పరిశ్రమలకు అనుమతులను ఇచ్చామని సిఎం వెల్లడించారు. అవినీతికి ఆస్కారం లేకుండా ‘బిజినెస్ ఎట్ ఈజ్' అనే పద్ధతిలో తెలంగాణ పారిశ్రామిక విధానం ఉందన్నారు. కంపెనీ ప్రతినిధులతోపాటు సిఎం అదనపు కార్యదర్శి శాంతకుమారి, టిఎస్‌ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
US based Advanced Optronic Devices (AOD) along with Indian company Syska has come forward to set up an LED plant in the state. It would invest Rs 500 crore spreading over 50 acres and will provide employment to 2000 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X