వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాక్: రాహుల్‌కు ఉత్తమ్ ఫిర్యాదు, పొన్నం వర్కింగ్ ప్రెసిడెంట్?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఫిర్యాదుపొన్నంకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరిన పలువుర ఎంపిలుక్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ఆద

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. 2019 ఎన్నికల వరకు పిసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనసాగుతారని కుంతియా చేసిన ప్రకటనపై కోమటిరెడ్డి సోదరులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ ప్రకటనపై ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశారు.

2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ చర్యలను తీసుకొంటుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీగా దిగ్విజయ్‌ను తొలగించి ఆయన స్థానంలో కుంతియాకు బాధ్యతలను కట్టబెట్టారు.

అయితే తెలంగాణలో కెసిఆర్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తీసుకోవాలని రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారని సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు , రానున్న రోజుల్లో ఏ రకమైన వ్యూహలను అనుసరించాలనే దానిపై తెలంగాణ నేతలతో రాహుల్‌గాంధీ చర్చించారని సమాచారం.

కోమటిరెడ్డి సోదరులపై ఫిర్యాదు

కోమటిరెడ్డి సోదరులపై ఫిర్యాదు

2019 ఎన్నికల వరకు తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనసాగుతారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవరాల ఇంచార్జీ కుంతియా ప్రకటనపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగంగానే కుంతియాపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శలపై కోమటిరెడ్డి సోదరులపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీకి ఫిర్యాదు చేశారని సమాచారం.

క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు

క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు

పార్టీ క్రమశిక్షణకు ఎవరైనా లోబడే ఉండాలని, అందుకు తగినట్లుగా మార్పులు తీసుకురావాలని కుంతియాను రాహుల్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. పార్టీలో అందరిని సంప్రదించి కలుపుకొని ముందుకు పోవాలని, అందరి సమస్యలు పరిష్కరించాలని, అవసరం అనుకుంటే తనదాక తీసుకురావాలని రాహుల్‌ సూచించారు.క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని రాహుల్ ఆదేశించారని సమాచారం.

టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పొన్నంను నియమించాలి

టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పొన్నంను నియమించాలి

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, బలరామ్‌నాయక్‌, సురేశ్‌ షెట్లర్‌, సిరిసిల్ల రాజయ్య బృందం కూడా రాహుల్‌ను కలిసింది. పార్టీ పదవుల్లో బీసీలకు అధిక ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అందులో భాగంగా పొన్నం ప్రభాకర్‌ను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించాలని రాహుల్‌ వద్ద ప్రతిపాదన తీసుకొచ్చినట్లు సమాచారం.

కెసిఆర్ విధానాలపై పోరాడాలి

కెసిఆర్ విధానాలపై పోరాడాలి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకుగాను అన్ని రకాల చర్యలను తీసుకోవాలని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ తెలంగాణ నేతలను కోరారు.టిఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాలని రాహుల్ సూచించారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

English summary
Tpcc president Uttam Kumar reddy complaint to Aicc vice president Rahulgandhi against komati brothers on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X