వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: డిఎస్‌పై విహెచ్ నిప్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన డి. శ్రీనివాస్‌పై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చానన్న డీఎస్ వైఎస్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని కాంగ్రెస్ ఆయన ప్రశ్నించారు.

దోచింది దాచుకోవడానికే డి శ్రనివాస్ టిఆర్ఎస్ పంచన చేరారని విమర్శించారు. బీఫామ్‌లు అమ్ముకున్న చరిత్ర డీఎస్‌దని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఫాంహౌస్‌లో కూర్చోబెట్టి డీఎస్‌ పనులు చక్కబెడతారని దుయ్యబట్టారు. డిఎస్‌తో కాస్తా జాగ్రత్తగా ఉండాలని ఆయన కెసిఆర్‌కు సూచించారు.

 VH lashes out at DS for joining TRS

ఇదిలావుంటే, కాంగ్రెస్‌ని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చానని డీఎస్‌ చెప్పటం సిగ్గుచేటని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మహేష్‌ కుమార్‌ గౌడ్ విమర్శించారు. ఎన్ని నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.

ఎనిమిది సార్లు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే 3 సార్లు మాత్రమే డీఎస్‌ గెలిచారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ డీఎస్‌కు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. కేవలం వ్యక్తిగత ఎజెండా కోసమే టీఆర్‌ఎస్‌లో చేరారని మహేష్‌ ఆరోపించారు.

English summary
Telangana Congress Rajya Sabha member V Hanumanth Rao lashed out at D Srinivas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X