హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్న పనే కానీ, గొప్పది: హ్యాట్సాఫ్ టు హైదరాబాద్ పోలీస్(వీడియో)

ఈదుల్ ఫితుర్ రోజున ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈదుల్ ఫితుర్ రోజున ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ పోలీసులు గొప్ప పనిచేశారంటూ, అందరి మనసులు గెలుచుకున్నారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఇంతకీ వారు ఏం చేశారంటే.. గత ఆదివారం రోజున కాలపత్తర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు వెంకటేష్ నాయక్, వి ప్రతాప్ సింగ్‌లు మీర్ ఆలం ఈద్గా వద్ద డ్యూటీ చేస్తున్నారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. అదే సమయంలో భారీగా గాలి వీస్తోంది.

దీంతో ప్రార్థనలు చేసేందుకు వేసుకున్న ముస్లిం సోదరుల చాప(ప్రేయర్ మ్యాట్స్) లేచిపోతున్నాయి. ఇది గమనించిన కానిస్టేబుళ్లు వెంటనే స్పందించారు. ప్రార్థన చేస్తున్న ముస్లిం సోదరులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేశారు. ఓ కానిస్టేబుల్ తన టోపీని మ్యాట్‌పై పెట్టి చాపను పైకి లేవకుండా చేశారు. మరొకరు ఓ సంచీని పెట్టారు.

కాగా, ఈ వీడియోను హైదరాబాద్ పోలీసు విభాగం వారు తాజాగా విడుదల చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 50వేల మందికిపైగా వీక్షించగా, 3,500మందికిపైగా స్పందించారు. ఈ క్రమంలో వీడియోను చూసిన నెటిజన్లు ఇద్దరు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా, ఇది కూడా తన విధుల్లో భాగమేనని, తాము అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తామని వెంకటేష్ నాయక్ తెలిపారు. ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని తన టోపీని మ్యాట్‌పై పెట్టానని తెలిపారు. నగరంలో హిందూ, ముస్లింలు సోదర భావంతో మెలుగుతారని మరో కానిస్టేబుల్ సింగ్ చెప్పారు. తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ అంటూ ఘటనపై స్పందించిన సయ్యద్ ముజమ్మిల్ అనే వ్యక్తి చెప్పారు.

English summary
A gesture on Eid-ul-Fitr by two constables is winning hearts. The two are seen helping worshippers on the streets by putting their caps onto the sheets of cardboard used as prayer mats as they were getting blown away by the wind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X