వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనసు పల్లె: అనాథ యువతి శ్రీవిద్యకు వివాహం జరిపించిన గ్రామస్తులు

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: తల్లీతండ్రి లేని ఆ నిరుపేద యువతికి పెళ్లి చేసేందకు మండలంలోని కొత్తపెళ్లి గ్రామస్థులు పెద్దమనసుతో ముందుకొచ్చారు. తలొకరు చేతనైనంత ఆర్థికసాయాన్ని అందించి, కొత్తకొండ దేవస్థానంలో శ్రీవిద్యకు పెళ్లి చేశారు. మానవత్వానికి చిరునామా గల్లంతైందని భావించేవారికి ఆదివారం జరిగిన ఈ వివాహ వేడుకే పెద్ద సమాధానం.

భీమదేవపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మార్పు రాంరెడ్డి, వెంకవ్వ దంపతులకు నలుగురు కుమార్తెలు, రెండో కుమార్తె రేవతిని జమ్మికుంట మండలం కనగర్తికి చెందిన పొన్నాల శ్రీనివాస్‌రెడ్డికు ఇచ్చి 1990లో వివాహం జరపించారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు శ్రీవిద్య, శ్రీహర్ష. శ్రీవిద్య ఆరు నెలల వయసులో ఉండగానే... అనారోగ్యానికి గురై శ్రీనివాస్‌రెడ్డి-రేవతి దంపతులు కన్నుమూశారు. అప్పటి నుంచి అమ్మమ్మ వెంకవ్వనే శ్రీవిద్య, శ్రీహర్షల బాగోగులు చూశారు.

కాగా, గత కొంత కాలం క్రితం వెంకవ్వ భర్త మార్పు రాంరెడ్డి సైతం కన్నుమూశాడు. దీంతో ఐదు, మూడు సంవత్సరాల వయస్సు ఉన్న శ్రీవిద్య, శ్రీహర్షలను ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలోని బొక్కలగుట్ట సమీపంలోని అనాథాశ్రమంలో చేర్పించి చదివించారు. ఆ ఆశ్రమం కరస్పాండ్‌ చార్లిన్‌విగ్‌.. శ్రీవిద్యను కన్న కూతురిలా పెంచారు. హోటల్‌ మేనేజ్‌మెంట్ చేసేందుకు అయిన ఖర్చంతా భరించారు.

Villagers supports an orphan girl marriage

అప్పగింతలు.. కన్నీళ్లు..

అనాథ యువతి శ్రీవిద్యను పెళ్లి చేసుకునేందుకు మానవకొండూర్‌ మండలం వేగురుపల్లికి చెందిన నందికొండ వెంకటరాజిరెడ్డి ముందుకొచ్చాడు. కానీకట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో శ్రీవిద్య పెళ్లి బాధ్యతలు తీసుకునేందుకు కొత్తపల్లి గ్రామస్తులు చొరవ చూపారు. ప్రస్తుతం వెంకటరాజిరెడ్డి మెడికల్‌ ఏజెన్సీలో రిప్రజేంటేవ్‌గా పని చేస్తున్నారు.

కొత్తకొండ దేవస్థానంలో ఈ వివాహం జరిగింది. శ్రీవిద్య చిన్నమ్మలు, పెద్దమ్మలు కొంత బంగారం తీసుకురాగా గ్రామస్తులు మరింత బంగారాన్ని జత చేశారు. భోజనాల ఖర్చు, బట్టలు, పెళ్లి ఖర్చులు మొత్తం కొత్తపల్లివాసులే భరించారు. ఊరిలోని ప్రతీ ఇంటి నుంచి ఒకరు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. అప్పగింతల సందర్భంగా కన్న బిడ్డలా శ్రీవిద్యకు ధైర్యం చెప్పి.. కన్నీళ్లు పెట్టుకున్నారు. పల్లె జనుల్లోని మల్లెలాంటి మనస్థత్వాన్ని చాటి చెప్పారు.

అమ్మానాన్నను మరిపించారు : శ్రీ విద్య, పెళ్లి కూతురు

'పెళ్లి అంటే తల్లిదండ్రుల సమక్షంలో జరగాల్సిన కార్యక్రమం. ఆ బాధ్యతను మా ఊరివాళ్లు తీసుకున్నారు. వాళ్లు నాపై ఆదరాభిమానాలు చూపించి, అమ్మానాన్నను మరిపించారు. మా అనాథాశ్రమం కరస్పాండ్‌ చార్లిన్‌విగ్‌ నాకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చారు. గ్రామస్థులకు జీవితాంతం రుణపడి ఉంటా, నా పెళ్లికి సహకరించినవారికి కృతజ్ఞతలు' అని శ్రీవిద్య తెలిపింది.

English summary
A Villagers has been supported an orphan girl 's marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X