డిఎస్ స్థానంలో సలహాదారుగా వివేక్, కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్ర

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ పార్లమెంటు సభ్యులు జి వివేక్‌ను నియమించారు. ఇప్పటి వరకు డి శ్రీనివాస్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయన స్థానంలో తెలంగాణ సర్కార్ వివేక్‌ను నియమించింది.

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ పార్లమెంటు సభ్యులు జి వివేక్‌ను నియమించారు. ఇప్పటి వరకు డి శ్రీనివాస్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయన స్థానంలో తెలంగాణ సర్కార్ వివేక్‌ను నియమించింది. అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నారు.

Vivek replaces D Srinivas as Advisor

కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్ర

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ రోజు (బుధవారం) పదవీ విరమణ చేయనున్నారు. సచివాలయ ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు సీఎస్‌కు వీడ్కోలు సభ ఏర్పాటు చేయనున్నారు. వీడ్కోలు సభకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కానున్నారు.

Vivek replaces D Srinivas as Advisor

రాజీవ్ శర్మ స్థానంలో నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రను ప్రభుత్వం నియమించనుంది. ప్రదీప్ చంద్ర నియామకానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపారు. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

English summary
G Vivek replaces D Srinivas as Telangana Government Advisor.
Please Wait while comments are loading...