వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తట్టుకోలేకే ఉద్యమం: కెసిఆర్, లక్ష్యంతోనే(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నల్గొండ: సమైక్య పాలకుల వివక్షను తట్టుకోలేక తెలంగాణ ఉద్యమం చేశామని, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. శనివారం నాగార్జునసాగర్‌ విజయవిహార్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో పాల్గొని ప్రసంగించారు.

కష్టపడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ రాష్ట్రంగా తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. శిక్షణా తరగతుల వల్ల ఎంతో ఉపయోగం ఉందని, ఇక్కడి సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరస్పర చర్చల ద్వారానే సమస్యలు తెలుస్తాయన్నారు. తెలంగాణ అభ్యుదయమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.

హన్మంతరావును కొనియాడిన కెసిఆర్

ఆర్థికవేత్త హన్మంతరావును ఎంతో ప్రశంసించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఎవరూ పుట్టుకతోనే గొప్పవాళ్లు కాదని, కష్టపడి శ్రమించి విజ్ఞానం సంపాదించి గొప్పవాళ్లవుతారని తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్, హన్మంతరావు క్లాస్‌మేట్స్ అనే విషయాన్ని సీఎం గుర్తు చేశారు. హన్మంతరావు ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రజ్ఞ సాధించారని వివరించారు. ఆయన అనుకుంటే ఎప్పుడో కేంద్రమంత్రి పదవో, గవర్నర్ పదవో చేపట్టేవారని తెలిపారు.

ఇందిరాగాంధీ వంటి మహామహులే హన్మంతరావును గౌరవించే వారని, ఇంటికి పిలిపించుకుని మాట్లాడేవారని తెలిపారు. అంతటి ప్రతిభ ఉన్న వ్యక్తి వెలుగులోకి రాకపోవడానికి కారణం సమైక్య పాలకులే అని తెలిపారు. హన్మంతరావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడైతే ఎప్పుడో వెలుగులోకి వచ్చే వారని తెలిపారు. సిద్ధిపేటకు చెందిన కాపు రాజయ్య గొప్ప చిత్రకారుడని, ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని తాము ఎన్నిసార్లు కేంద్రానికి విన్నవించుకున్న ఆయనకు పద్మశ్రీ రాకుండా ఆంధ్రా పాలకులు అడ్డుకున్నారని ఆరోపించారు.

కెసిఆర్

కెసిఆర్

సమైక్య పాలకుల వివక్షను తట్టుకోలేక తెలంగాణ ఉద్యమం చేశామని, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

శనివారం నాగార్జునసాగర్‌ విజయవిహార్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో పాల్గొని ప్రసంగించారు.

తరగతులు ఇక్కడే

తరగతులు ఇక్కడే

కష్టపడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.

శిక్షణా తరగతులు

శిక్షణా తరగతులు

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ రాష్ట్రంగా తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. శిక్షణా తరగతుల వల్ల ఎంతో ఉపయోగం ఉందని, ఇక్కడి సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శిక్షణా తరగతులు

శిక్షణా తరగతులు

పరస్పర చర్చల ద్వారానే సమస్యలు తెలుస్తాయన్నారు. తెలంగాణ అభ్యుదయమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.

నేర్చుకోవడానికి ముందుండాలి

శిక్షణా తరగతులు పరస్పర అభిప్రాయాలు పంచుకునే వేదిక అని, మొదటిసారిగా పరస్పరం అభిప్రాయాలు పంచుకునేందుకు శిక్షణా తరగతులు నిర్వహించుకుంటున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. వాస్తవానికి మనం ఈ పని ఎప్పుడో చేయాల్సింది కానీ పని ఒత్తిడి వల్ల ఆలస్యమైందని వివరించారు. మిషన్ కాకతీయను ఆర్థికవేత్త హన్మంతరావు అభినందించడం సంతోషమని పేర్కొన్నారు.

ఆయన సూచనలను పాటిస్తూ మిషన్ కాకతీయను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అట్టడుగు ప్రజలకు కూడా ఉన్నత విద్యను అందించినపుడే గ్లోబలైజేషన్ విజయవంతం అవుతుందని హన్మంతరావు చెప్పారని అన్నారు. ఆర్థికవేత్తగా హన్మంతరావు 60 సంవత్సరాల దేశ పరిస్థితులను చూశారని తెలిపారు. పలు కీలక సూచనలు చేసిన హన్మంతరావు, లింగ్డో, రవికాంత్‌కు రాష్ట్ర ప్రజల తరపున ధన్యావాదాలు తెలిపారు.

ఇకముందు ప్రతీ ఆరునెలల కొకసారి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. అయితే ఇలా రెండు మూడు రోజులు ఉండదని ఒక్కరోజు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలని, నేర్చుకోవడానికి ఎప్పుడూ ముందుండాలని కోరారు.

మనకు తెలిసింది కొంతేనని, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుందని అన్నారు. ఎవరూ అన్ని రంగాల్లో నిష్టాతులు కాలేరని అది సాధ్యం కూడా కాదన్నారు. నవీన యుగంలో, నవీన శకంలో కొత్త పంథాతో కొత్త ఆలోచనలతో ముందుకెళ్దామని విజ్ఞప్తి చేశారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Saturday said that they agitated against discrimination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X