వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టులపై కెసిఆర్ వైఖరేమిటో చెప్పాలి :గద్దర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

మెదక్ :మావోయిస్టు లపై తన వైఖరేమిటో చెప్పాలని ప్రజా గాయకుడు గద్దర్ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ప్రశ్నించారు.ఒడిశా ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు ప్రభాకర్ మృతదేహానికి యాప్రాల్ లో గద్దర్ నివాళులర్పించారు.

ఒడిశా ఎన్ కౌంటర్ లో నగరానికి చెందిన ప్రభాకర్ మరణించారు.ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులు నగరానికి తీసుకువచ్చారుప్రభాకర్ పార్థీవదేహం వద్ద గద్దర్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ఒడిశా ఎన్ కౌంటర్ లో తమకు అనుమానాలున్నాయని చెప్పారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల్లోకి వెళ్ళి మరీ ఎందుకు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

kcr

నక్సలైట్ ఉద్యమం, మావోయిస్టు పార్టీ తన వైఖరేమిటో స్పష్టం చేయాలని తెలంగాణ సిఎం కెసిఆర్ ను గద్దర్ ప్రశ్నించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో తాము మావోయిస్టు ఎజెండాను అమలు చేస్తామని కెసిఆర్ ప్రకటించారు.అయితే ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని గద్దర్ కెసిఆర్ కు ఈ ప్రశ్న సందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరంగల్ లో విద్యాసాగర్, శృతి ఎన్ కౌంటర్ జరిగింది.ఈ ఘటనను ప్రజా సంఘాలు తప్పుబట్టాయి.

English summary
what is your opinion about maoist party gaddar asked to cm kcr.one year back vidyasagar, shrut ecncountered by police at warangal distrit.so gaddar asked telangana state cm.why police enter in to forest for an encounter asked gaddar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X