హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రహస్య విచారణ: హైకోర్టు ధర్మాసనం ముందు ప్రత్యూష ఏం చెప్పింది?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన సవతి తల్లి, తండ్రి రమేష్ కుమార్ చేతుల్లో చిత్రహింసలకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయిన 19 ఏళ్ల ప్రత్యూషను తెలంగాణ సర్కార్ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బోసాలే తన ఛాంబర్‌లో మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్‌‌తో కలిసి రహస్య విచారణ చేపట్టారు. ఈ రహస్య విచారణకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ కుమార్, ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్‌ను మాత్రమే విచారణకు అనుమతించింది.

ఈ రహస్య విచారణలో హైకోర్టు ధర్మాసనం ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ విచారణలో ప్రత్యూష తన సవతి తల్లి, తండ్రి చేతుల్లో తాను ఏవిధంగా చిత్రిహింసలకు గురైందనే విషయాన్ని వివరించింది.

What said pratyusha in front of high court bench

అంతేకాదు తన సవతి తల్లి, తండ్రికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్టు కూడా ఆమె ధర్మాసనానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో ధర్మానసం కలగజేసుకుని ఈ విషాయన్ని న్యాయస్ధానాలు చూసుకుంటాయని, చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత స్ధాయిలో స్ధిరపడాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆ తర్వాత ఏం అవుతావనే విషయంపై కూడా హైకోర్టు ధర్మాసనం ఆరా తీసింది. తనకు నర్సు అవ్వాలనే కోరిక బలంగా ఉందని, నర్సింగ్ కోర్సు చదువుతానని ప్రత్యూష చెప్పింది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దని, ముందు ఇంటర్ పూర్తి చేసి, ఆ తర్వాత నర్సింగ్ కోర్సు పూర్తి చేయాలని ధర్మాసనం సూచించింది.

ప్రస్తుతం జైలులో ఉన్న ప్రత్యూష తండ్రి రమేష్ కుమార్‌కు వస్తున్న జీతం నుంచి కొంత మొత్తాన్ని ప్రత్యూషకు అందేలా చూడాలని స్పెషల్ జీపీ శరత్‌కుమార్‌కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ప్రత్యూష పేరుపై ఉన్న డబుల్ బెడ్‌రూం ద్వారా వచ్చే అద్దెను కూడా ఆమెకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

అవసరమైతే ప్రత్యూష పేరిట ఓ బ్యాంకు ఖాతాను తెరిచి, ఆ మొత్తాలు అందులో జమయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఇక ప్రత్యూష విషయంలో సీఎం కేసీఆర్ స్పందించిన తీరును హైకోర్టు ధర్మాసనం అభినందించింది.

ప్రత్యూషను తాను తన ఇంటికి తీసుకుని వెళ్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యూష చదువు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన చెప్పారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రత్యూషకు భరోసా ఇచ్చిన తీరును ఎంతో గొప్పగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అనంతరం ఆమెను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లాలని హైకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరిచింది. మధ్యాహ్నాం ప్రత్యూషను సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి తీసుకురాగా కేసీఆర్‌తో కలిసి భోజనం చేసిన సంగతి తెలిసిందే. తన నివాసానికి వచ్చిన ప్రత్యూషను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

బాగా చదివి పైకి రావాలని ప్రత్యూషకు సూచించారు. నిన్ను కష్టపెట్టిన వారికి ఇదే నీవు వేసే శిక్ష అని చెప్పారు. అంతేకాదు ప్రత్యాషకు సీఎం కేసీఆర్ తన ఫోన్ నెంబర్ ఇచ్చి, ఎప్పుడైనా ఇంటికి రావొచ్చని చెప్పారు.

సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రత్యూషకు రూ. 5 లక్షళు మంజూరు చేశారు. ఆమె పేరిట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బును అందులో జమ చేయాలని అధికారులకు ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో ప్రత్యూష చాలా సంతోషపడింది.

English summary
What said pratyusha in front of high court bench in enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X